సౌదీలో ప్రారంభమైన కింగ్ అబ్ధులాజీజ్ ఫాల్కన్రీ ఫెస్టివల్..రెండు వారాల డేగల పోటీలు

- November 28, 2020 , by Maagulf
సౌదీలో ప్రారంభమైన కింగ్ అబ్ధులాజీజ్ ఫాల్కన్రీ ఫెస్టివల్..రెండు వారాల డేగల పోటీలు

సౌదీ అరేబియాలో థార్డ్ ఎడిషన్ కింగ్ అబ్ధులాజీజ్ ఫాల్కన్రీ ఫెస్టివల్ నేటి నుంచి ప్రారంభం అవుతోంది. డేగల ఆందాల పోటీలు, ఫ్లైయింగ్ పోటీలతో సందడిగా సాగే ఈ ఫెస్టివల్ రెండు వారాల పాటు జరగనుంది. రియాద్ సమీపంలో నిర్వహిస్తున్న ఫాల్కన్రీ ఫెస్టివల్ కోసం 22.7 మిలియన్ల సౌదీ రియాల్స్ ను బహుమతిగా కేటాయించినట్లు ఫాల్కన్ క్లబ్ ప్రకటించింది. స్థానిక, అంతర్జాతీయంగా డేగ సొంతదారులు ఫాల్కన్ ఫెస్టివల్ లో పాల్గొని ప్రైజ్ మనీ గెలుచుకోవచ్చని క్లబ్ ప్రతినిదులు వెల్లడించారు. ఈ ఏడాది డేగ అందాల పోటీలతో పాటు 400 మీటర్ల ఫ్లైయింగ్ కాంపిటీషన్ నిర్వహించనున్నారు. ఫాల్కన్ బ్యూటీ కాంటెస్ట్ ఏడు రౌండ్లు నిర్వహిస్తామని..విజేతకు 4.2 సౌదీ రియాల్స్ బహుమతి దక్కుతుందని వివరించారు. తొలి రెండు ఎడిషన్లలో 4,073 డేగలు ఫాల్కన్ ఫెస్టివల్ లో పాల్గొన్నాయని తెలిపారు. అయితే..కోవిడ్ నేపథ్యంలో ఫెస్టివల్ లో పాల్గొనేవారు, ఫెస్టివల్ కు వచ్చే వారి ఆరోగ్య సంరక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని ఫాల్కన్ క్లబ్ వెల్లడించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com