కువైట్:వలసదారులకు ఫ్లూ వ్యాక్సిన్ వచ్చేవారం నుంచి
- November 28, 2020
కువైట్ సిటీ: కువైట్, అదనంగా 50,000 డోసుల ఫ్లూ వ్యాక్సిన్ పొందనుంది. ఈ వ్యాక్సిన్లను కువైటీలతోపాటు వలసదారులకు కూడా అందిస్తారు. 50 ఏళ్ళ వయసు పైబడిన వారికి ఈ వ్యాక్సిన్ ఇస్తారు. వైద్య వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు అవసరమైనవారికి ఈ వ్యాక్సిన్లు అందించనున్నారు. అయితే, ఆన్‌లైన్ ద్వారా అపాయింట్‌మెంట్‌ని వారు పొందాల్సి వుంటుంది. గత నెలలో ఫ్లూ వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభించినప్పుడు, ముందుగా కువైటీలకు మాత్రమే దాన్ని అందించారు. మూడవ బ్యాచ్ వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో, మిగిలినవారికి కూడా వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. మొత్తం 1,50,000 వ్యాక్సిన్లను ఇప్పటికే అవసరమైనవారికి ఇవ్వడం జరిగింది. డిసెంబర్ నాటికి 400,000 వ్యాక్సిన్లను అందివ్వడం లక్ష్యంగా పెట్టుకున్నారు. సెంటర్ ఫర్ డిసీజ్ ప్రివెన్షన్ వెల్లడించిన వివరాల ప్రకారం డిసెంబర్‌లో ఫ్లూ వ్యాక్సిన్ అలాగే కోవిడ్ వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి రావొచ్చని తెలుస్తోంది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- అరబ్-భారత సహకార వేదిక ఉజ్వల భవిష్యత్తుకు వారధి..!!
- ఖతార్, భారత్ మధ్య పెట్టుబడి అవకాశాలపై చర్చలు..!!
- షార్జాలో సినిమా ఫక్కీలో కారు చోరీ.. దొంగ అరెస్ట్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ కెమెరా వ్యవస్థ మొదటి దశ ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో ఫాగ్, రెయిన్స్ హెచ్చరికలు జారీ..!!
- అంతరిక్ష రంగంలో మరిన్ని పెట్టుబడులకు ఒమన్ పిలుపు..!!
- పిల్లల ఇంటర్నెట్ వాడకం పై కఠిన నిబంధనలు..
- తెలంగాణ–ఏపీలో జియో శిక్షణ తరగతులు
- CBSE బోర్డ్ ఎగ్జామ్స్: ఆఖరి 3 వారాల స్మార్ట్ రివిజన్ ప్లాన్..
- మేడారంలో భక్తజన సంద్రం







