క్షమాభిక్ష ప్రకటించిన ఒమాన్ ప్రభుత్వం
- November 28, 2020
మస్కట్:చట్టవిరుద్ధంగా ఒమాన్ దేశంలో ఉంటున్న వారందరిని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి జరిమానాలు లేకుండా ఇంటికి వెళ్ళడానికి అవకాశం కల్పించి ఇటీవల క్షమాభిక్షను ప్రకటించిన ఒమాన్ ప్రభుత్వానికి ఒమాన్ తెలంగాణ ఫ్రెండ్స్ అధ్యక్షులు నరేంద్ర పన్నీరు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. కుటుంబ వీసాలపై, సందర్శన వీసాలపై లేదా వర్క్ వీసాలపై వచ్చి చట్టవిరుద్ధంగా ఒమాన్ లో ఉంటున్న తెలుగు వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొవాలని ఆయన విజ్ఙప్తి చేశారు.ఈ సందర్భంగా నరేంద్ర పన్నీరు మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఇందుకు సహరించాలని ఏ.పి, తెలంగాణ ప్రభుత్వాలు చొరవ తీసుకొని ఒక నోడల్ ఆఫీసర్ ని ప్రత్యేకంగా నియమించి పాస్పోర్ట్ కార్యలయం అందించే ఎమర్జెన్సీ సర్టిఫికెట్ అంటే ఔట్ పాసులు జారిచేయడం లో జాప్యం లేకుండా చూడాలని తెలంగాణ,ఏ.పి ప్రభుత్వాలను కోరారు.ఇక్కడ ఉన్నటువంటి తెలుగు సంఘాలకు సహాయం చేయడానికి తగిన గుర్తింపు నిచ్చి వారి సేవలను కూడా వినియోగించుకోవాలని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వీలయినంత వరకు ఎక్కువ విమానాలు ఏర్పాటు చేసి ఇక్కడ ఇబ్బందుల్లో ఉన్నటువంటి పేద గల్ఫ్ కార్మికులకు ఉచిత విమాన టికెట్లను అందించి వారిని క్షేమంగా తెలుగు రాష్ట్రాలకు చేర్చాలని ఆయన విజ్ఙప్తి చేశారు.
ఈ అవకాశం 15,నవంబర్, 2020 నుండి 31,డిసెంబర్,2020 వరకు అందుబాటులో ఉంటుంది. డిసెంబర్ 31 లోపల అనుమతి పొందిన వారు ఆ తర్వాత కూడా ప్రయాణించవచ్చు అని తెలిపారు.మానవ వనరుల మంత్రిత్వ శాఖ వెబ్సైట్ లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు లేదా దగ్గర లోని సనద్ సర్వీసెస్ లో నమోదు చేసుకోవచ్చు లేదా ఈ విషయం లో ఎవరికైనా సందేహాలున్నా లేదా ధరఖాస్తు చేసుకోవడం లో సహాయం కావాలన్న ఒమాన్ తెలంగాణ ఫ్రెండ్స్ సభ్యులైన నరేంద్ర పన్నీరు - 97837893, కుమార్ మంచికట్ల - 93767387, వేమనకుమార్ - 90831775 మరియు మురళి వడ్లపట్ల - 9770 1701లను సంప్రదించవచ్చు. మరియు టీం ముఖ్య సభ్యులైన మామిడి శ్యాం, చేని ప్రభాకర్, వంకాయాల కార్తిక్ మరియు గరిగే రమేష్, చేని గురువయ్య లు అందుబాటులో ఉంటారని నరేంద్ర పన్నీరు తెలిపారు.

తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







