ఫేక్‌ ఐపీ అడ్రస్‌ వినియోగిస్తే 2 మిలియన్‌ దిర్హాముల జరీమానా

- November 29, 2020 , by Maagulf
ఫేక్‌ ఐపీ అడ్రస్‌ వినియోగిస్తే 2 మిలియన్‌ దిర్హాముల జరీమానా

దుబాయ్‌:ఫేక్‌ ఇంటర్నెట్‌ ప్రోటోకాల్‌ అడ్రస్‌ని వినియోగించి నేరాలకు పాల్పడితే, అలాంటివాసరరియకి 500,000 దిర్హాముల నుంచి 2 మిలియన్‌ దిర్హాముల వరకు జరీమానా ఎదుర్కోవాల్సి రావొచ్చు. అలాగే జైలు శిక్ష కూడా తప్పకపోవచ్చు. ఈ విషయాన్ని పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌ మరోమారు స్పష్టం చేసింది. ఐపీ అడ్రస్‌ అనేది కంప్యూటర్‌ నెట్‌వర్క్‌లో కమ్యూనికేషన్‌ కోసం ఆయా డివైజ్‌లకు ఏర్పాటు చేయబడుతుందనీ, ఫెడరల్‌ చట్టం 5 - 2012, ఆర్టికల్‌ 9 ప్రకారం, సైబర్‌ క్రైమ్‌ నిబంధనల్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవనీ అధికారులు హెచ్చరించారు. ఇలాంటి కేసుల్లో 500,000 దిర్హాములకు తగ్గకుండా 2 మిలియన్‌ దిర్హాములకు మించకుండా జరీమానాతోపాటు, జైలు శిక్ష కూడా పడే అవకాశం వుంది. వర్చువల్‌ ప్రైవేట్  నెట్‌వర్క్‌ ద్వారా థర్డ్‌ పార్టీ ఐపీ అడ్రస్‌ని క్రియేట్‌ చేసుకుంటే అది నేరం కింద పరిగణిస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com