అక్రమ వ్యాపారులపై ఉక్కుపాదం
- November 29, 2020
మనామా:క్యాపిటల్ మునిసిపాలిటీ, వీధి వ్యాపారులకు సంబంధించి 1,932 ఉల్లంఘనల్ని గుర్తించి తొలగించడం జరిగింది గడచిన తొమ్మిది నెలల్లో. మునిసిపాలిటీ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఆయా వీధుల్లో అక్రమ వ్యాపారుల కారణంగా అందమైన, పరిశుశ్రమైన అప్పీయరెన్స్ దెబ్బతింటోందనీ, ఈ కారణంగా ఎప్పటికప్పుడు తగిన చర్యలు చేపడుతున్నామని అధికారులు తెలిపారు. పబ్లిక్ రోడ్ వర్క్స్ యాక్ట్ ఉల్లంఘించిన పలువురిపై కేసులు నమోదు చేయడంతోపాటుగా, ఆక్రమణల్ని తొలగిస్తున్నట్లు చెప్పారు. గత శుక్రవారం 20 మాట్రెసెస్ని మనామా సెంటర్లోని కాంప్లెక్స్ 304 నుంచి తొలగించడం జరిగింది. మూడో త్రైమాసికంలో అక్రమ వీధి వ్యాపారుల తొలగింపు 633కి చేరుకుంది. మొత్తంగా జనవరి నుంచి సెప్టెంబర్ వరకు ఈ తొలగింపుల సంఖ్య 1,924కి చేరింది. ఈ తరహా అక్రమ వ్యాపారుల్ని ప్రోత్సహించరాదని పౌరులు అలాగే నివాసితులకు అధికారులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







