భూమికి దగ్గరగా బుర్జ్ ఖలీఫా సైజు ఆస్టరాయిడ్
- November 29, 2020
ఓ భారీ ఆస్టరాయిడ్ ఆదివారం భూమికి దగ్గరగా వస్తోంది. దాని సైజు దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా అంత ఉంటుందని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ ఆస్టరాయిడ్ పేరు (153201) 2000 WO107. 800 మీటర్ల ఎత్తు, 500 మీటర్ల వెడల్పు ఉన్న ఈ ఆస్టరాయిడ్ భారత కాలమానం ప్రకారం ఉదయం 10:38 గంటలకు భూమికి అత్యంత చేరువగా వస్తున్నట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా చెప్పింది. ఈ ఆస్టరాయిడ్‌ను 2000వ సంవత్సరంలో కనుగొన్నారు. దీనిని నియర్ ఎర్త్ ఆస్టరాయిడ్ (ఎన్ఈఏ)గా గుర్తించారు. ఇవి సమీపంలోని గ్రహాల గురుత్వాకర్షణ శక్తి కారణంగా వాటి వైపు ఆకర్షితమవుతాయి. భూమికి 43 లక్షల కిలోమీటర్ల దగ్గర నుంచి ఇది వెళ్తోందని సైంటిస్టులు చెప్పారు. దీనిని చాలా ప్రమాదకరమైన ఆస్టరాయిడ్ జాబితాలో చేర్చారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష