GHMC ఎన్నికల ప్రచారానికి తెర

- November 29, 2020 , by Maagulf
GHMC ఎన్నికల ప్రచారానికి తెర

హైదరాబాద్: హైదరాబాద్ లో రోడ్లు ఖాళీ అయ్యాయి.. మైకులు మూగబోయాయి.. నేతల నోళ్లకు తాళం పడింది.. మొత్తంగా గ్రేటర్‌ వార్‌లో కీలక ఘట్టానికి తెరపడింది.. వారం రోజులపాటు హోరాహోరీగా సాగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారం ముగిసింది.. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ చివరి నిమిషం వరకు పార్టీలు విమర్శల వర్షం కురిపించుకున్నాయి.. ప్రతి నిమిషాన్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు అన్ని పార్టీలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ఓటర్ల దృష్టిని ఆకర్షించేందుకు చాలానే కష్టపడ్డాయి.

ప్రచారానికి గడువు ముగియడంతో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు పార్టీలు దారి మార్చాయి.. ఇప్పటి వరకు స్ట్రయిట్‌ రూట్‌లో ప్రచారం నిర్వహించిన పార్టీలు ఇప్పుడు మరో రూట్‌లో వెళ్తున్నాయి.. ధనం, మద్యం.. ఇలా అన్ని రూపాల్లో ఓటర్లకు గాలం వేసే ప్రయత్నం చేస్తున్నాయి.. కొందరు అభ్యర్థులైతే నగదు, చీరలు, వివిధ రకాల వస్తువులు, బహుమతులను పంపిణీ చేస్తూ ఆకట్టుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. అటు గడువు ముగిసిన తర్వాత ప్రచారం నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర ఎన్నికల సంఘం హెచ్చరించింది. ప్రచారానికి తెరపడటంతో మద్యం అమ్మకాలపై నిషేధం విధించింది. ఎన్నికలు ముగిసే వరకు జీహెచ్‌ఎంసీ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో మద్యం అమ్మకాలపై ఆంక్షలు కొనసాగనున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com