కోవిడ్ వ్యాక్సిన్ సరఫరా, దిగుమతికి అన్ని ఏర్పాట్లతో సిద్ధమైన సౌదీయా కార్గో
- December 01, 2020
సౌదీ:కోవిడ్ వ్యాక్సిన్ దాదాపు తుది దశలో ఉండటంతో వ్యాక్సిన్ దిగుమతి, వాటిని నిల్వకు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేసింది సౌదీ ప్రభుత్వం. అన్ని అనుకూలించి..తుది అనుమతులు రాగానే ఒప్పందం మేరకు వ్యాక్సిన్ ను దిగుమతి చేసుకునేలా కార్గో సర్వీసులను రెడీ చేసినట్లు సౌదీ కార్గో సీఈవో వెల్లడించారు. కింగ్డమ్ పరిధిలోని పలు విమానాశ్రాయాల్లో వ్యాక్సిన్ భద్రపరిచేందుకు అవసరమైన మోడల్ విలేజ్ లను ఏర్పాటు చేసినట్లు వివరించారు. రియాద్ లోని కింగ్ కలీద్ అంతర్జాతీయ విమానాశ్రయం, జెడ్డాలోని కింగ్ అబ్దుల్లాజీజ్ విమానాశ్రయం, దమ్మమ్ లోని కింగ్ ఫహ్ద్ అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ మోడల్ విలేజ్ లలో వ్యాక్సిన్ ను భద్రపరిచేందుకు కావాల్సిన శీతలీకరణ పరికరాలు, ఇతర మెడిసిన్ సరఫరాకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎక్విప్ మెంట్ రెడీ చేసినట్లు తెలిపారు. వ్యాక్సిన్ కు తుది అనుమతి రాగానే ఈ మూడు కార్గో సర్వీసుల ద్వారా ఈ మూడు విమానాశ్రయాలకు తరలించి...అక్కడి నుంచి కింగ్డమ్ పరిధిలో పంపిణీ చేయనున్నట్లు వివరించారు. ఇదిలాఉంటే..కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు పలు దేశాలకు మద్దతుగా 12 మిలియన్ కిలోగ్రాముల మెడిసిన్, వైద్య పరికరాలను తమ కార్గో సర్వీసుల ద్వారా అందించినట్లు సీఈవో గుర్తు చేశారు. కార్గో విమానాలతో పాటు అవసరమైతే కమర్షియల్ ఫ్లైట్స్, చార్టెడ్ ఫ్లైట్స్ ద్వారా కూడా వ్యాక్సిన్ సరఫరాకు రెడీ ఉన్నామన్నారు.
తాజా వార్తలు
- మహిళల హకీ ఆసియా కప్లో ఫైనల్కు భారత్
- జెడ్డాలో ప్రారంభమైన జ్యువెలరీ ఎక్స్పోజిషన్..!!
- కువైట్ లో భారత రాయబారిగా పరమితా త్రిపాఠి..!!
- కార్మికుడికి Dh1.5 మిలియన్ల పరిహారం..!!
- ప్రాంతీయ పరిణామాలపై యూఎన్ సెక్రటరీ జనరల్ ఆరా..!!
- అమెరికా వైస్ ప్రెసిడెంట్ తో ఖతార్ పీఎం సమావేశం..!!
- పోలీసుల అదుపులో పలువురు మోటార్ సైక్లిస్టులు..!!
- బీసీసీఐ అధ్యక్షుడి రేస్ లో ప్రముఖ క్రికెటర్ లు?
- ఒమన్ పై పాక్ విజయం..
- భారత దేశం మొత్తం టపాసులు బ్యాన్..