సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో GHMC ఎన్నికల పోలింగ్ ప్రశాంతం

- December 01, 2020 , by Maagulf
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో GHMC ఎన్నికల పోలింగ్ ప్రశాంతం

హైదరాబాద్:GHMC ఎన్నికల సందర్భంగా ఈరోజు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ సైబరాబాద్ పరిధిలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు.

బాలానగర్ జోన్ లోని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోని సీఎమ్ఆర్ హై స్కూల్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్, బాలాజీ ప్లే స్కూల్, శాంతినికేతన్ హై స్కూల్, కూకట్పల్లి లోని ఎస్ఎస్ డీ హై స్కూల్, బాలనగర్ లోని షంశీశగుడా  ఎమ్ పీ ప్రైమరీ హై స్కూల్, తదితర పోలింగ్ స్టేషన్ లంజే పరిశీలించారు.

మాదాపూర్ జోన్ లోని కీపీహెచ్ బీ పీఎస్ లిమిట్స్ లో ఉన్న మలేషియన్ టౌన్ షిప్ తదితర పోలింగ్ స్టేషన్లను పరిశీలించారు.శంషాబాద్ జోన్ లోని మైలార్ దేవ్పల్లి, రాజేంద్ర నగర్ పీ ఎస్ లిమిట్స్ లోని పోలింగ్ స్టేషన్లను పరిశీలించారు. బాబుల్ రెడ్డి నగర్, మార్కండేయ నగర్, సాయిబాబా నగర్, పద్మశాలి పురం, శ్రీ వేంకటేశ్వర కాలనీ, ప్రేమవతి పేట్ తదితర ప్రాంతాల్లోని పోలింగ్ స్టేషన్లను సందర్శించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందన్నారు. 
హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమీషనరేట్ లలో కలిపి మొత్తం 51,000 మంది బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.ఓటర్లందరూ ఓటు వేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారన్నారు.ప్రతీఒక్కరూ తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. 

ఈరోజు ఎన్ని పనులున్నప్పటికీ ముందుగా ఓటు వేయాలన్నారు. ఓట్ ఫస్ట్, వర్క్ నెక్స్ట్ అన్నారు. ఓటర్లకు తాగునీరు, టెంట్లు, వృద్ధులకు వీల్ ఛైర్స్ తదితర వసతులు కల్పించామన్నారు.ప్రత్యేకించి వృద్ధులు, మహిళలకు కోసం చేసిన ఏర్పాట్లపై సంతృప్తిని వ్యక్తం చేశారు.ప్రజలందరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఓటింగ్ లో పాల్గొనాలన్నారు.
పోలింగ్ స్టేషన్ల్ ల వద్ద ఏమైనా ఇబ్బంది ఉంటే పోలీసుల దృష్టికి తీసుకురావాలన్నారు.
సీపీ వెంట డీసీపీ శంషాబాద్ ప్రకాష్ రెడ్డి, డీసీపీ మాదాపూర్ వెంకటేశ్వర్లు, డీసీపీ బాలానగర్ పీవీ పద్మజా, సీఏఆర్ హెడ్ క్వార్టర్ ఏడీసీపీ మాణిక్ రాజ్, ఎస్ఓటీ ఏడీసీపీ సందీప్, ఏడీసీపీ కవిత, కూకట్పల్లి ఏసీపీ సురేందర్, బాలానగర్ ఏసీపీ పురుషోత్తం, ఇన్ స్పెక్టర్లు తదితరులు ఉన్నారు.జీహెచ్ఎమ్ సీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు సహకరించిన రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ పార్థసారథి, ఐఏఎస్, ఎన్నికలు నిర్వహించిన సిబ్బందికి, ఎన్నికల నిర్వహణకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన సిబ్బందికి,వివిధ రాజకీయ పార్టీల నాయకులకు, ఓటు వేసేందుకు ముందుకు వచ్చిన ప్రజలందరికీ, ఎప్పటికప్పుడు ప్రజలకు వార్తలను చేరవేసిన మీడియా మిత్రులకు, పోలీస్ సిబ్బందికి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.

అదే విధంగా GHMC కమీషనర్ డీఎస్ లోకేష్ కుమార్ కి, జీహెచ్ఎమ్ సీ జోనల్ కమీషనర్లకు, GHMC సిబ్బందికి, ఎన్నికల నిర్వహణకు బయట జిల్లాల నుంచి వచ్చిన పోలీస్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com