ఏపీ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ జరిగే శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించిన డిజిపి
- December 01, 2020
విజయవాడ:ఏపీ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ విభాగం సుమారు 81,02,000 లక్షలతో కొనుగోలు చేసిన అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞ్యనం కలిగిన 3డి స్కానర్ , మొబైల్ ఫోరెన్సిక్ మల్టీ స్పెక్ట్రల్ ఫింగర్ ప్రింట్ డిటెక్షన్ టాబ్లెట్ , ఇమేజింగ్ సిస్టం ఆన్ బాడీ ఫ్లూయిడ్స్ పరికరాల పైన మూడు రోజుల శిక్షణ కార్యక్రమాలను ఆంధ్ర ప్రదేశ్ డిజిపి గౌతం సవాంగ్ IPS ప్రాంభించారు. ఈ పరికరాలు అందుబాటులోకి రావడంతో దేశంలోనే అత్యంత ఆధునిక పరికరాలను వినియోగిస్తున్న ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ రాష్ట్రాల జాబితాలోకి ఆంధ్రప్రదేశ్ చేరింది ఇప్పటికే గుజరాత్, బీహార్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఈ పరికరాలను వినియోగిస్తున్నాయి.
ఈ సంధర్భంగా డిజిపి మాట్లాడుతూ తాజా ఆధునిక శాస్త్రీయ పరికరాలు, గాడ్జెట్‌లు సాక్ష్యాల సేకరణలో3D స్కానర్ ఎంతగానో ఉపయోగపడుతుంది అని వాటి ద్వారా అసలైన నేరస్తులను శిక్షించ వచ్చన్నారు.అంతే కాకుండా గతంలో క్రైమ్ సీన్ స్కెచింగ్ మానవీయంగా జరిగేది అని దాని ద్వారా ఎక్కువ సమయంతో వృధా అవడంతో పాటు కేసు ఫలితాలకు ఎక్కువ సమయం తీసుకునేది అని ఈ ఆధునిక పరికరాలు అందుబాటులోకి రావడంతో ఎంతో సమయం ఆదా తోపాటు దర్యాప్తు వేగంగా పూర్తి అవుతుంది అని పేర్కొన్నారు.మొదటిరోజు శిక్షణలో భాగంగా దర్యాప్తు అధికారులకు శాస్త్రీయ పరికరాల ముఖ్య ఉద్దేశం, వాటి వినియోగం,తీసుకోవాల్సిన జాగ్రత్రలపైన శిక్షణ ఇవ్వడం జరిగింది.రెండవ రోజు, మూడవ రోజు శిక్షణలో భాగంగా ఫోరెన్సిక్ మరియు ఫింగర్ ప్రింట్స్ అధికారులకు ప్రత్యేక విధానంతో పరికరాన్ని నేర స్థలంలో ఏ రకంగా ఉపయోగించాలి మరియు త్వరితగతిన ఫలితాన్ని సంభందిత దర్యాప్తు అధికారికి అందించడం తద్వారా కేసు దర్యాప్తు సత్వరమే పూర్తి అయ్యేలా తీసుకోవాల్సిన చర్యలు అనే అంశాలపైన శిక్షణ అందిస్తారు. ఫోరెన్సిక్ విభాగం కొనుగోలు చేసిన ఈ అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలను ప్రాంతీయ శాస్త్ర విజ్ఞాన ప్రయోగశాలలు విజయవాడ, విశాఖపట్నం మరియు తిరుపతి కేంద్రాలకు అందించడం జరుగుతుంది.
తాజా వార్తలు
- మస్కట్‌లో పార్కింగ్ సర్వే ప్రారంభం..!!
- త్వరలో ఆటోమేటిక్ వెహికల్ ఇన్ ఫెక్షన్ సెంటర్ ప్రారంభం..!!
- జిసిసి ప్రతినిధులతో అమీర్ సమావేశం..!!
- ‘శ్రావణం’ ఓనం ఉత్సవంలో గ్రాండ్ కాన్సర్ట్..!!
- కొత్త చట్టం.. గరిష్టంగా SR20,000 జరిమానా..!!
- యూఏఈ ప్రవాసిని వరించిన Dh1 మిలియన్ లాటరీ..!!
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!