రేపు కేంద్రంతో మరోసారి రైతుల చర్చలు
- December 02, 2020
న్యూఢిల్లీ: రైతులతో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ నిన్న సమావేశం అయిన విషయం తెలిసిందే. అయితే ఆ చర్చలు ఫలపద్రం కాకపోవడంతో గురువారం మరోసారి సమాశమయ్యేందుకు ఇరువర్గాలు అంగీకరించాయి. దీంతో రేపు మరోసారి రైతులతో కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపనున్నారు. చర్చల సమయంలో రైతు సంఘాల ప్రతినిధులు ఇప్పుడు కమిటీల ఏర్పాటు చేయడానికి సమయం లేదు అని స్పష్టం చేశారు. కొత్త చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఎక్కువ మంది సభ్యులుంటే ఏకాభిప్రాయం రావడం కష్టమని, ఐదారుగురు నేతలు కమిటీగా రావాలని సూచించారు. ఏ చర్చకైనా ప్రభుత్వానికి అభ్యంతరం లేదు. నాలుగో రౌండ్ చర్చలు గురువారం జరుగుతాయని పేర్కొన్నారు. కాగా, కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళన కొనసాగిస్తున్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల