అంతర్జాతీయ ప్రయాణీకుల కోసం ‘వాట్సాప్ వర్చువల్ అసిస్టెంట్ చాట్-బాట్’ ప్రారంభం

- December 02, 2020 , by Maagulf
అంతర్జాతీయ ప్రయాణీకుల కోసం ‘వాట్సాప్ వర్చువల్ అసిస్టెంట్ చాట్-బాట్’ ప్రారంభం

హైదరాబాద్:రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(RGIA)లో డ్యూటీ ఫ్రీ షాపులను నిర్వహిస్తున్న GMR హైదరాబాద్ డ్యూటీ ఫ్రీ (HDF), ఇటీవల “వాట్సాప్ వర్చువల్ అసిస్టెంట్ చాట్-బాట్” పేరిట ఒక ప్రత్యేకమైన సర్వీస్‌ను ప్రారంభించింది. ఈ సర్వీస్‌ ద్వారా వచ్చీ, పోయే అంతర్జాతీయ ప్రయాణీకులు వాట్సాప్‌ను ఉపయోగించి HDF‌తో సంభాషించడానికి, వారి ప్రశ్నలకు సమాధానం పొందవచ్చు. ఇంకా సహాయం అవసరమైతే వారు HDF కస్టమర్ ఎగ్జిక్యూటివ్‌ను తిరిగి కాల్ చేయమని కోరవచ్చు.

2.7 బిలియన్లకు పైగా వినియోగదారులున్న వాట్సాప్ సామర్థ్యాన్ని ఉపయోగించుకొనే ఈ కొత్త చాట్-బాట్, కస్టమర్లతో ఎంగేజ్ కావడానికి చాలా అనుకూలమైనది. వినియోగదారులతో బలమైన సంబంధాలను పెంచుకోవడానికి ఇది సహాయపడుతుంది.

వివిధ కేటగిరీలలో 100 కు పైగా బ్రాండ్లు కలిగిన HDF మరచిపోలేని షాపింగ్ అనుభవాన్ని ఇస్తుంది. ప్రపంచంలోని అత్యుత్తమ బ్రాండ్లు మరియు ప్రామాణికమైన ఎంపిక చేసిన సావనీర్లు ఇక్కడ లభ్యమౌతాయి. సందర్శించిన ప్రతిసారీ HDF తన వినియోగదారులకు అత్యుత్తమ విలువను, మెరుగైన షాపింగ్ అనుభవాన్ని అందించడం ద్వారా భారతదేశంలోని ఉత్తమ ట్రావెల్ రిటైలర్లలో ఒకటయ్యేందుకు HDF ప్రయత్నిస్తోంది.


కోవిడ్-19 నేపథ్యంలో ఈ సర్వీస్ అంతర్జాతీయ ప్రయాణికులు HDF గురించి, దాని ఉత్పత్తుల గురించి తెలుసుకోవడానికి, అవసరమైతే వ్యక్తిగతంగా సంభాషించడానికి ఉపయోగపడుతుంది. 
ప్రయాణీకులు వాట్సాప్ కాంటాక్ట్ + 91-72729 93377 పై పింగ్ చేయడం ద్వారా చాట్ ప్రారంభించవచ్చు. ‘తరచుగా అడిగే ప్రశ్నల’కు అక్కడ తక్కువ సమయంలో సమాధానం ఇస్తారు. ప్రయాణీకులకు మరింత సహాయం అవసరమైతే, వారు దాని కోసం సంబంధిత ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. HDF కస్టమర్ ఎగ్జిక్యూటివ్ వీలైనంత త్వరగా తిరిగి కాల్ చేస్తారు. 
ఈ కోవిడ్-19 సమయంలో,  అంతర్జాతీయ ప్రయాణికులకు స్టోర్ లోకేషన్, అక్కడ భద్రత, HDF ఉత్పత్తులు,  ఇతర సంబంధిత సేవలపై ప్రశ్నలు తలెత్తుతుంటాయి. ప్రయాణికులకు ఏ సమయంలోనైనా సమాధానాలు పొందడానికి ఈ సర్వీస్ సహాయపడుతుంది.
కోవిడ్-19 నేపథ్యంలో ఆన్‌లైన్ షాపింగ్ అన్నది నూతన నియమంగా మారింది. విమానాశ్రయంలో మెరుగైన కస్టమర్ సేవలు, డ్యూటీ-ఫ్రీ షాపింగ్ అనుభవాన్ని అందించడంలో ఈ సర్వీస్ ఒక ముందడుగు. 

ఆసక్తిగల ప్రయాణీకులతో మొదటి టచ్ పాయింట్ వద్ద కనెక్ట్ అవ్వాలనే లక్ష్యంతో ప్రారంభించిన ఈ వాట్సాప్ వర్చువల్ అసిస్టెంట్ చాట్-బాట్ ప్రయాణీకులను కొనుగోలుదారులుగా మార్చడంలో సహాయపడుతుంది.

హైదరాబాద్ విమానాశ్రయం నుంచి క్రమంగా ప్రయాణీకుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో, HDF మరోసారి COVID-19 కారణంగా దెబ్బ తిన్న వ్యాపారాలకు ఉత్ర్పేరకంగా పని చేయనుంది.
ఈ కొత్త సర్వీస్ గురించి వ్యాఖ్యానిస్తూ, ప్రదీప్ పాణికర్, CEO, GHIAL, “హైదరాబాద్ డ్యూటీ ఫ్రీ అంటే సంతోషకరమైన షాపింగ్ అనుభవం, అద్భుతమైన డీల్స్, ఉత్తేజకరమైన ప్రమోషన్స్. అంతే కాకుండా ఇది బెస్ట్ ప్రైసెస్‌కు పర్యాయపదంగా మారింది. ఈ మహమ్మారి సమయంలో, HDF తన వర్చువల్ వాట్సాప్ చాట్‌బాట్ ద్వారా ప్రయాణీకుల ప్రశ్నలు, డిమాండ్లను రియల్ టైమ్‌లో పరిష్కరించడానికి చాలా కృషి చేసింది. HDF యొక్క ఈ సేవ ప్రయాణికులకు ప్రపంచ స్థాయి డ్యూటీ-ఫ్రీ షాపింగ్ అనుభవాన్ని మరియు కస్టమర్ సేవలను అందిస్తుంది.” అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com