ఫైజర్ వ్యాక్సిన్ కు యూకే ప్రభుత్వం ఆమోదం
- December 02, 2020
లండన్:యూఎస్ లో కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఫైజర్ కంపెనీ వ్యాక్సిన్ ను తయారు చేసింది. ఈ వ్యాక్సిన్ ను వివిధ దేశాల్లో ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. ట్రయల్స్ మంచి ఫలితాలను ఇస్తున్నది. వ్యాక్సిన్ ను రిలీజ్ చేసేందుకు అనుమతులు ఇవ్వాలని ఇప్పటికే ఫైజర్ సంస్థ అమెరికన్ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. దీనిపై అమెరికా ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకోబోతున్నది. ఇక ఇదిలా ఉంటె, ఫైజర్ కంపెనీ వ్యాక్సిన్ కు యూకే ప్రభుత్వం ఆమోదం తెలిపింది. యూకే లో ఆమోదం పొందటంతో అక్కడ వ్యాక్సిన్ ను అత్యవసరంగా వినియోగంలోకి తీసుకొచ్చేందుకు ఫైజర్ ఏర్పాట్లు చేస్తున్నది ఈనెల 7 వ తేదీ నుంచి వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ముందుగా 80ఏళ్లకు పైబడిన వారికి వ్యాక్సినేషన్ ఇవ్వబోతున్నారు. ఆ తరువాత కరోనా వారియర్స్ కు, అనంతరం మిగతా ప్రజలకు అందుబాటులో ఉంచుతారు. యూకేలో సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. రికార్డ్ స్థాయిలో కేసులు నమోదవుతుండటంతో యూకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
తాజా వార్తలు
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!