కువైట్ నుంచి పెట్టుబడులను ఆహ్వానించిన భారత టెక్స్ టైల్ మినిస్టర్ స్మృతి ఇరానీ

- December 03, 2020 , by Maagulf
కువైట్ నుంచి పెట్టుబడులను ఆహ్వానించిన భారత టెక్స్ టైల్ మినిస్టర్ స్మృతి ఇరానీ

న్యూఢిల్లీ:భారత టెక్స్ టైల్ రంగంలో కువైట్ పెట్టుబడులు పెడితే ఇరు దేశాలకు ప్రయోజనకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు భారత టెక్స్ టైల్ మినిస్టర్ స్మృతి ఇరానీ. భారత్ లో కువైట్ రాయబారి జస్సిమ్ అల్ నజిమ్ న్యూఢిల్లీలో స్మృతి ఇరానీతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలపై చర్చించిన కేంద్రమంత్రి...భారత టెక్స్ టైల్ రంగంలో కువైట్ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నట్లు ఆ దేశ రాయబారికి తెలిపారు. ఇరు దేశాల ప్రభుత్వాధినేతలు తీసుకుంటున్న చర్యలు, పరస్పర సహకారంతో కువైట్-భారత్ పురోవృద్ధిగా పయనిస్తున్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com