రైల్వేలో ఉద్యోగాలు..
- December 03, 2020
హుబ్లీ ప్రధాన కేంద్రంగా ఉన్న సౌత్ వెస్ట్రన్ రైల్వే (ఎస్‌డబ్ల్యూఆర్) స్పోర్ట్స్ కోటా ద్వారా 21 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అథ్లెటిక్స్, బ్యాట్‌మెంటన్, క్రికెట్, వెయిట్ లిప్టింగ్, టేబుల్ టెన్నిస్, హాకీ తదితర క్రీడాంశాలకు సంబందించిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. పదోతరగతి/ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత క్రీడల్లో జాతీయ/అంతర్జాతీయ స్థాయిలో ఆడి ఉన్న వారు అర్హులు. ఆసక్తిగల అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. డిసెంబర్ 28 దరఖాస్తుకు చివరి తేది. పూర్తి వివరాలకు https://www.rrchubli.in/వెబ్‌సైట్ చూడొచ్చు. మొత్తం ఖాళీలు: 21 అథ్లెటిక్స్ (మెన్)-3 అథ్లెటిక్స్ (ఉమెన్)-2 బ్యాడ్మింటన్ (మెన్) -2 క్రికెట్ (మెప్)-3 వెయిట్ లిప్టింగ్ (మెన్)-2 టేబుల్ టెన్నిస్ (మెన్)-1 హాకీ (మెన్)-4 స్విమ్మింగ్ (మెన్)-2 గోల్డ్ (మెన్)-2 అర్హత: పదోతరగతి/ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత క్రీడల్లో జాతీయ/అంతర్జాతీయ స్థాయిలో ఆడి ఉండాలి. వయసు: 01.01.2021 నాటికి 18-25 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక విధానం: ఫీల్డ్ ట్రయిల్స్, క్రీడా విజయాల మదింపు, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. చిరునామా: రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్, 2వ అంతస్తు, పాత జీఎం ఆఫీస్ బిల్డింగ్ క్లబ్ రోడ్, హుబ్లీ- 582323. చివరి తేదీ: డిసెంబర్ 28,2020
తాజా వార్తలు
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..