ఒమన్‌లో పలు చోట్ల వర్షపాతం, జాగ్రత్తగా వుండాలని హెచ్చరిక

- December 08, 2020 , by Maagulf
ఒమన్‌లో పలు చోట్ల వర్షపాతం, జాగ్రత్తగా వుండాలని హెచ్చరిక

మస్కట్‌: పబ్లిక్‌ అథారిటీ ఫర్‌ సివిల్‌ డిఫెన్స్‌ మరియు అంబులెన్స్‌, భారీ వర్షాల కారణంగా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా వుండాలని హెచ్చరికలు జారీ చేసింది. వ్యాలీలు దాటేటప్పుడు అప్రమత్తంగా వుండాలని ఈ హెచ్చరికల్లో పేర్కొన్నారు. పలు చోట్ల నీరు నిలిచిపోయి, ప్రమాదాలకు ఆస్కారం ఏర్పడుతుందనీ, కొన్ని చోట్ల నీటి ప్రవాహాలు అధికంగా వుండొచ్చనీ, ఈ నేపథ్యంలో పౌరులు, నివాసితులు అప్రమత్తంగా వుండాలని హెచ్చరికల్లో పేర్కొన్నారు అధికారులు.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com