అబుదాబీలో ఇండియన్ పాస్‌పోర్ట్ రెన్యువల్: కొత్త నిబంధన
- December 09, 2020
అబుధాబి: జనవరి 31 లోపు గడువు తీరే పాస్‌పోర్టుల రెన్యువల్ మాత్రమే చేపడుతున్నట్లు అబుదాబీలోని ఇండియన్ ఎంబసీ పేర్కొంది. తదుపరి నోటీస్ వచ్చేవరకూ ఈ నిబంధన అమల్లో వుంటుందని ఎంబసీ మిషన్ పేర్కొంది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అత్యవసరంగా పాస్‌పోర్ట్ సేవలు కావాల్సినవారు, తమ డాక్యుమెంట్లను మెయిల్ చేయాల్సి వుంటుంది. ఎమర్జన్సీకి సంబంధించిన వివరాల్ని కూడా ఇ-మెయిల్‌లో వెల్లడించాలి. ఎంబసీ, అలాంటి అత్యవసర విషయాలపై తక్షణం స్పందించి, తదిన కాన్సులర్ సేవలు అందించడం జరుగుతుంది. గత నెలలో ఎంబసీ మరో సూచన కూడా చేయడం జరిగింది. కంపెనీ పీఆర్వోల ద్వారా ఉద్యోగుల అప్లికేషన్లను సమర్పించడానికి అవకాశం కల్పించారు. తద్వారా నేరుగా కంపెనీ ఎంప్లాయిస్ ఎంబసీని ఆశ్రయించాల్సిన అవసరం వుండదు. అంతకు ముందు సమీపంలోని బిఎల్ ఎస్ సెంటర్ వద్ద వ్యక్తిగతంగా దరఖాస్తుదారులు హాజరవ్వాల్సి వచ్చేది.
తాజా వార్తలు
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్‌కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్









