నేడు భారత దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రైతుల నిరాహార దీక్షలు
- December 14, 2020
న్యూఢిల్లీ: భారత కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు దేశవ్యాప్తంగా ఉద్యమం కొనసాగుతుది. ఈ నేపథ్యంలోనే అన్నదాతలు ఈరోజు అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసనలు చేపట్టాలని నిర్ణయించారు. ఢిల్లీ సరిహద్దుల్లో అన్ని రైతు సంఘాల నాయకులు ఉదయం 8 నుంచి సాయంత్రం 5 వరకు నిరాహారదీక్ష చేపట్టనున్నారు. రైతులకు మద్దతుగా తాను కూడా నిరాహార దీక్ష చేస్తానని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఆప్ కార్యకర్తలతోపాటు దేశ ప్రజలందరూ ఒక్క రోజు దీక్షలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. మరోవైపు, కొత్త చట్టాలపై ప్రభుత్వానికి పలువురు రైతులు మద్దతు ప్రకటిస్తున్నారని, వారితో తమకు ఎలాంటి సంబంధం లేదని రైతు ఉద్యమ నేతలు స్పష్టంచేశారు. ప్రభుత్వంతో చేతులు కలిపి తమ పోరాటానికి వెన్నుపోటు పొడవాలని కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ఆదివారం రాజస్థాన్‌లోని షాజహాన్‌పూర్ నుంచి రైతన్నలు ట్రాక్టర్ మార్చ్ నిర్వహించగా హర్యానా పోలీసులు అడ్డుకున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







