వదిలివేయబడ్డ వాహనాల ఆక్షన్‌

- December 14, 2020 , by Maagulf
వదిలివేయబడ్డ వాహనాల ఆక్షన్‌

మస్కట్:వదిలివేయబడ్డ వాహనాల్ని జనరల్‌ పబ్లిక్‌, అమెరాత్‌లోని బలాదియా యార్డ్‌లో పరీక్షించుకోవచ్చని మస్కట్‌ మునిసిపాలిటీ పేర్కొంది. పలు రకాల ఉల్లంఘనల నేపథ్యంలో వాహనాల్ని స్వాధీనం చేసుకోవడం లేదా సివిక్‌ అథారిటీ ద్వారా బలవంతంగా తరలించిన వాహనాల్ని ఇక్కడ డంప్‌ చేయడం జరిగింది. ఆయా వాహనాల విషయమై యజమానులు ముందుకు రాని పక్షంలో, వాటిని ఆక్షన్‌ వేసే అవకాశం వుంటుంది. డిసెంబర్‌ 15 లేదా 16 తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య వాహనాల్ని పరిశీలించి, తమ ఆలోచనల మేరకు ఏదన్నా వాహనాన్ని కొంత మొత్తం చెల్లించి సొంతం చేసుకోవచ్చు. ఆక్షన్‌ వేయబడే ప్రాంతంలోకి ప్రవేశించేందుకు 4 ఒమన్‌ రియాల్స్‌ చెల్లించాల్సి వుంటుంది. ఇది తిరిగి చెల్లించబడదు. ఆక్షన్‌లో పాల్గొనేందుకు తిరిగి చెల్లించే వీలున్న 500 ఒమన్‌ రియాల్స్‌ చెల్లించాల్సి వుంటుంది. సక్సెస్‌ఫుల్‌ బిడ్డింగ్‌ తర్వాత మొత్తం సొమ్ముతోపాటు, 3 శాతం ప్రమోషనల్‌ ఛార్జీలు చెల్లించాలి. ఆక్షన్‌ పూర్తయ్యాక 10 రోజుల్లోగా ఓనర్‌షిప్‌ బదలాయించబడుతుంది. ఆలస్యం చేస్తే రోజుకి 50 ఒమన్‌ రియాల్స్‌ ఛార్జీ వుంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com