గ్రేటర్ లోని ట్రాన్స్ ఫర్ స్టేషన్ల ఆధునీకరణ పనులు వేగవంతం చేయండి - మేయర్ బొంతు రామ్మోహన్

- December 15, 2020 , by Maagulf
గ్రేటర్ లోని ట్రాన్స్ ఫర్ స్టేషన్ల ఆధునీకరణ పనులు వేగవంతం చేయండి - మేయర్ బొంతు రామ్మోహన్

హైదరాబాద్:గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 17 ట్రాన్స్ ఫర్ స్టేషన్ల ఆదునీకరణ పనులను వేగవంతం చేయాలని నగర మేయర్ బొంతు రామ్మోహన్ పేర్కొన్నారు. హైదరాబాద్ ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ ప్రాజెక్ట్ పురోగతిపై జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో నేడు సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఇ.వి.డి.ఎం డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి, అడిషనల్ కమిషనర్ సంతోష్, జోనల్ కమిషనర్లు ప్రావిణ్యా,  శ్రీనివాస్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి, అశోక్ సామ్రాట్, మమతలతో పాటు రాంకీ ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ... నగరంలోని 17 ట్రాన్స్ ఫర్ స్టేషన్లను ఆధునీకరించాలనే లక్ష్యానికిగాను ఏడు ట్రాన్స్ ఫర్ స్టేషన్లు పూర్తి అయ్యాయని అన్నారు. పూర్తైనవాటిలో ఇమ్లీబన్, కైతలాపూర్, సంజీవయ్య పార్కు, మల్లాపూర్, అంబర్ పేట్, కాటేదాన్, పటాన్ చెరువు లు ఉన్నాయని పేర్కొన్నారు. వీటిలో సంజీవయ్య పార్కు, మల్లాపూర్, కాటేదాన్, అంబర్ పేట్ లలో పూర్తిస్థాయి కార్యకలాపాలు ప్రారంభమయ్యాయని తెలిపారు.GHMCలో ప్రస్తుతం ఉన్న స్వచ్ఛ ఆటోలకు అదనంగా మరో 650 అధిక సామర్థ్యం గల స్వచ్ఛ ఆటోలు త్వరలోనే రానున్నాయని తెలిపారు. దీనిలో భాగంగా ఇప్పటికే నాలుగున్నర టన్నుల కెపాసిటి కలిగిన 150 స్వచ్ఛ ఆటోలు కొద్దిరోజుల్లో రానున్నాయని, వీటిని ప్రతి జోన్ కు 25 చొప్పున అందజేయనున్నట్లు మేయర్ రామ్మోహన్ వెల్లడించారు. ఈ అధిక సామర్థ్యం గల స్వచ్ఛ ఆటోలను నగరంలోని ప్రధాన కమర్షియల్ ప్రాంతాల్లో వినియోగించాలని పేర్కొన్నారు. తమ జోన్ లో స్థానిక పరిస్థితులను విశ్లేషించి కావాల్సిన అదనపు స్వచ్ఛ ఆటోల సంఖ్యను వెంటనే తెలియజేయాలని రామ్మోహన్ కోరారు.

ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ది పై సమీక్ష సమావేశం
ఉప్పల్ శాసన సభ నియోజకవర్గ అభివృద్ది పై సమీక్ష సమావేశాన్ని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి తో కలిసి నగర మేయర్ బొంతు రామ్మోహన్ నేడు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ సమీక్ష సమావేశానికి ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని ప్రస్తుత కార్పొరేటర్లు, వివిధ విభాగాల అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ...ఉప్పల్ నియోజకవర్గంలో అసంపూర్తిగా ఉన్న అభివృద్ది పనులన్నింటినీ త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. జంక్షన్ల ఆధునీకరణ, డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం, లింక్ రోడ్లు, నాలా విస్తరణ పనులు, చెరువుల అభివృద్ది పనులు, శానిటేషన్ తదితర అంశాలపై ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి మేయర్ రామ్మోహన్ లు విడివిడిగా సమీక్షించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com