కోవిడ్ 19 వ్యాక్సిన్ వేయించుకున్న దుబాయ్ పారిశ్రామికవేత రిజ్వాన్ సజన్
- December 15, 2020
దుబాయ్:దుబాయ్ కి చెందిన పారిశ్రామికవేత దనుబె గ్రూప్ చైర్మన్ రిజ్వాన్ సజన్ కోవిడ్ 19 వ్యాక్సిన్ తీసుకున్నారు. చైనాకు చెందిన సినోఫార్మ్ వ్యాక్సిన్ ను డోసులను వేయించుకున్నట్లు ఆయన తన ఇన్ స్ట్రాగ్రామ్ లో ఫోటో షేర్ చేశారు. సినోఫార్మ్ తో పాటు కోవిడ్ వ్యాక్సిన్ లపై ప్రజల్లో ఇప్పటికి కొన్ని అనుమానాలు, ఆందోళన నెలకొని ఉన్న నేపథ్యంలో రిజ్వాన్ షేర్ చేసిన ఫోటో ప్రాధాన్యతను సంతరించుకుంది. చైనాకు చెందిన సినోఫార్మ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత తనకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని, అంతా సాధారణంగానే ఉందని రిజ్వాన్ చెబుతున్నారు. పకడ్బందీ ప్రమాణాలతో ప్రయోగాలు నిర్వహించిన తర్వాతే సినోఫార్మ్ మార్కెట్లోకి వచ్చిందని...అందుకే వ్యాక్సిన్ పై తనకు పూర్తి నమ్మకం ఉందని అన్నారు. ఇదిలాఉంటే...పౌరులు, ప్రజలకు వ్యాక్సిన్ డోసులు వేసే ఆరోగ్య కేంద్రాలు, ఆస్పత్రలు జాబితాను యూఏఈ ఆరోగ్య శాఖ విడుదల చేసింది. అయితే..వాలంటరీగా వచ్చిన వారికీ మాత్రమే వ్యాక్సిన్ ఇస్తామని..బలవంతంగా ఎవరికి వ్యాక్సిన్ ఇవ్వబోమని కూడా తెలిపింది. ప్రవాసీయులు తామకు వీసా జారీ అయిన ప్రాంతంలోని ఆస్పత్రుల్లో మాత్రమే వ్యాక్సిన్ వేయించుకోవాల్సి ఉంటుందని క్లారిటీ ఇచ్చింది.
తాజా వార్తలు
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్
- డిసప్పియర్ ఇంక్‌తో చెక్కు.. ఓ అరబ్ వ్యక్తికి షాకిచ్చిన దుబాయ్ కోర్టు..!!
- కువైట్ లో బాటిల్ వాటర్ కొనుగోలుపై పరిమితి కొనసాగింపు..!!
- ఉగ్రవాద ముఠా అరెస్ట్ పై కువైట్ హోంశాఖ క్లారిటీ..!!
- 7రోజుల్లో 18 వేల ఎక్స్ పైరీ ఉత్పత్తులు స్వాధీనం..!!
- జీ20 ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ దేశాల్లో సౌదీకి చోటు..!!
- బహ్రెయిన్ లో విదేశీ వైద్యుల ఆపరేషన్లపై కఠిన నిబంధనలు..!!
- చక్కెర పానీయాల ఎక్సైజ్ పన్నుపై టాక్స్ అథారిటీ క్లారిటీ..!!







