ఖతార్ లో మరో వరల్డ్ కప్ స్టేడియం ప్రారంభానికి సిద్ధం
- December 15, 2020
దోహా:ఖతార్ లో నాలుగో వరల్డ్ కప్ స్టేడియం ప్రారంభానికి సిద్ధమైంది. వీఐపీలు, అభిమానులు, ఆటగాళ్ల నడుమ మరో మూడ్రోజుల్లో అల్ రయ్యాన్ లోని ఫిఫా వరల్డ్ కప్ స్డేడియాన్ని ప్రారంభించబోతున్నారు. 2022 వరల్డ్ కప్ ఈ స్డేడియం వేదిక కానుంది. అంతేకాదు...ఖతార్ జాతీయ దినోత్సవం రోజున ప్రారంభం కానున్న ఈ స్టేడియంలో రిబ్బన్ కట్ అయిన కొద్ది గంటల్లోనే అమీర్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుండటం విశేషం. మొత్తం 40 వేల మంది కెపాసిటీ కలిగిన స్టేడియం నిర్మాణంలో మరో ప్రత్యేకత ఏటంటే...దీని నిర్మాణంలో 90 శాతం పాత స్టేడియంలోని మెటీరియల్ నే వినియోగించి పనులు పూర్తి చేశారు. ఫుట్ బాల్ లవర్స్ ఎక్కువగా ఉండే ఖతార్ లో స్టేడియం ప్రారంభాన్ని హిస్టారిక్ డేగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఓపెనింగ్ రోజున మ్యాచ్ కు మూడు గంటల ముందు నుంచే గ్రాండ్ గా కల్చరల్ ప్రొగ్రామ్స్ నిర్వహించనున్నారు. అయితే..కోవిడ్ నేపథ్యంలో ఆరోగ్య శాఖ మార్గనిర్దేశకాల మేరకు ప్రారంభోత్సవంతో పాటు..ఫైనల్ మ్యాచ్ నిర్వహణలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. స్టేడియం కెపాసిటిలో సగం మందిని మాత్రమే అనుమతించనున్నారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్
- డిసప్పియర్ ఇంక్‌తో చెక్కు.. ఓ అరబ్ వ్యక్తికి షాకిచ్చిన దుబాయ్ కోర్టు..!!
- కువైట్ లో బాటిల్ వాటర్ కొనుగోలుపై పరిమితి కొనసాగింపు..!!
- ఉగ్రవాద ముఠా అరెస్ట్ పై కువైట్ హోంశాఖ క్లారిటీ..!!
- 7రోజుల్లో 18 వేల ఎక్స్ పైరీ ఉత్పత్తులు స్వాధీనం..!!







