శబ్ద కాలుష్య వాహనాల డ్రైవర్ లకు పోలిసుల హెచ్చరిక

- February 20, 2016 , by Maagulf
శబ్ద కాలుష్య వాహనాల డ్రైవర్ లకు పోలిసుల హెచ్చరిక

విపరీత శబ్దాలను కల్గించే కొందరు వాహనాల డ్రైవర్ లను ట్రాఫిక్ అధికారులు హెచ్చరించారు. ప్రజలని ఇబ్బంది కల్గించే విధంగా బిగ్గరగా హారన్లు మోగించడం మానివేయని వారిపై ఇకపై క్రమశిక్షణ చర్యలు తీసుకోక తప్పదని  ట్రాఫిక్ జనెరల్ డైరక్టర్ షేక్ నసీర్ బిన్ అబ్దుల్ రహమాన్ అల్ ఖలీఫా శుక్రవారం ఒక  పత్రికా ప్రకటనలో తెలిపారు. రణగొణ ధ్వనులను కల్గిస్తూ ప్రజలను శబ్ద కాలుష్యానికి గురిచేసే వారిపై ఇటీవల 236 ఉల్లంఘన నేరాలు నమోదయినట్లు ఆయన తెలిపారు. ఈ తరహా పిర్యాదులు ఇటీవల తమకు ఎక్కువ అయినందున రద్దీగా ఉండే రహదారులపై ట్రాఫిక్ పోలీసుల గస్తీ ని ఎక్కువగా పెంచి బిగ్గరగా హారన్లు మోగించేవారిపై చర్యలు  తీసుకోనున్నట్లు చెప్పారు. ఏ వాహనదారుడైనా అనవసర శబ్దాలను కల్గించితే, తమకు పిర్యాదు చేయాలని ఆయన కోరారు. కొంతమంది డ్రైవర్ లు తమ సాధారణ కార్లకు రేసింగ్ కార్ల శబ్దాలు ఏర్పాటు చేసుకొంటున్నారని, అవి ఎక్కడ్నుంచో వేగంగా దూసుకువచ్చినట్లు వచ్చి కీచు మనే శబ్దంతో  వెనుక ఆగినట్లుగా కృత్రిమ గోల కారణంగా ప్రజలు భయపడే విధంగా వింత ధ్వనులు పెడుతున్నారని  చెబ్తూ...ఇకపై వారు తామే స్వచ్చంగా తొలగించుకోవాలని సూచించారు. ఈ దేశంలో ఈ తరహా ప్రయోగాలు చెల్లవని ఆయన వివరించారు. 

                
           
              
                    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com