అబుధాబి లో క్రిస్‌మస్ వేడుకల కోసం రిజిస్ట్రేషన్
- December 16, 2020
అబుధాబి:కరోనా నేపథ్యంలో 'న్యూ నార్మల్'కి అనుగుణంగా క్రిస్‌మస్ వేడుకలు ఏర్పాటు చేస్తున్నారు. కొన్ని ప్రముఖ చర్చిలు, వర్చువల్ విధానం ద్వారా భక్తులకు ఆయా కార్యక్రమాల్ని చేరువ చేయనున్నాయి. ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లను చేస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. క్రిస్‌మస్ మాస్సెస్‌కి ప్రత్యక్షంగా హాజరవ్వాలనుకునేవారు ఆన్‌లైన్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి వుంటుంది. చిన్న పిల్లలు, వృద్ధులు వీలైనంతవరకు ఇలాంటి కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాల్గొనకపోవడమే మంచిదనీ, వారి కోసం వర్చువల్ విధానంలో ఆయా వేడుకల్ని అందుబాటులోకి తెస్తామని ఆయా చర్చిల పాస్టర్లు కోరుతున్నారు. వర్చువల్ క్రిస్‌మస్ విలేజ్ ఈ ఏడాది ప్రధాన ఆకర్షణ కానుందని సెంట్ జార్జి ఆర్తోడాక్స్ కేథడ్రల్ వెల్లడించింది. డిసెంబర్ 20 నుంచి 26 వరకు సెంట్ జోసెఫ్ కేథడ్రల్‌లో కార్యక్రమాలుంటాయనీ, ఓ వ్యక్తి ఓ క్రిస్‌మస్ మాస్‌కి మాత్రమే హాజరయ్యేందుకు వీలుందని నిర్వాహకులు తెలిపారు.
--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







