కొత్త రూట్లలో స్పైస్‌జెట్
- December 18, 2020
ముంబై:స్పైస్‌జెట్ మరో 30 రూట్లకు సర్వీసులను దశలవారీగా వచ్చే వారం నుంచి ఆరంభించబోతున్నట్లు ప్రకటించింది. కరోనా కారణంగా రద్దుచేసుకున్న విమానాల్లో మళ్లీ 80 శాతం వరకు సర్వీసులను ఆరంభించుకోవచ్చన్న కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు స్పైస్‌జెట్ ఈ నిర్ణయం తీసుకుంది. దీంట్లోభాగంగా రేపటి నుంచి అహ్మదాబాద్, పుణె, హైదరాబాద్‌ల నుంచి బీహార్‌లోని దార్‌భంగ మధ్య విమాన సర్వీసులు నడుపబోతుంది. అలాగే కొత్తగా హైదరాబాద్-వైజాగ్, ముంబై-గోవా, కోల్‌కతా-గోవా, అహ్మదాబాద్-గోవా, ముంబై-కంద్లా, ముంబై-గువాహటి, గువాహటి-కోల్‌కతా, చెన్నై-షిర్డిల మధ్య సర్వీసులు రానున్నాయి. మొత్తంగా తెలుగు రాష్ట్రాల మధ్య కూడా స్పైస్ జెట్ సర్వీసులు ప్రారంభం కాబోతున్నాయి... కాగా, కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా.. జాతీయ, అంతర్జాయ విమానా సర్వీసులను పూర్తిగా రద్దు చేసిన సంగతి తెలిసిందే.. క్రమంగా కేసులు తగ్గుముఖం పట్టడంతో.. అన్నింటికి అనుమతి ఇస్తూ వస్తోంది కేంద్ర ప్రభుత్వం.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







