కోవిడ్‌ సేఫ్టీ రూల్స్‌: తనిఖీల్లో ఓ సంస్థ నిర్లక్ష్యం గుర్తింపు

- December 22, 2020 , by Maagulf
కోవిడ్‌ సేఫ్టీ రూల్స్‌: తనిఖీల్లో ఓ సంస్థ నిర్లక్ష్యం గుర్తింపు

దుబాయ్‌ ఎకానమీ 345 సంస్థల్లో కోవిడ్‌ 19 సేఫ్టీ రూల్స్‌ విషయమై తనిఖీలు నిర్వహించటం జరిగింది. ఈ తనిఖీల్లో 344 సంస్థలు ఆయా రూల్స్‌ని సరిగ్గానే ఫాలో అవుతున్నట్లు గుర్తించారు అధికారులు. అయితే, ఓ సంస్థలో మాత్రం నిర్లక్ష్యాన్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఆ సంస్థకు హెచ్చరికలు జారీ చేయడం జరిగిందనీ, జరీమానా మాత్రం విధించలేదని అధికారులు పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా వుండాలనీ, కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు అందరూ సహకరించాలని అథారిటీ విజ్ఞప్తి చేసింది. ఎవరైనా ఉల్లంఘనలకు పాల్పడితే దుబాయ్‌ కన్స్యుమర్‌ అప్లికేషన్‌ లేదా 600545555 నెంబర్‌కి కాల్‌ చేసిగానీ ఫిర్యాదు చేయవచ్చు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com