బ్రిటన్‌లో విజృంభిస్తోన్న కొత్త రకం వైరస్,తెలంగాణలో ఇద్దరికి లక్షణాలు
- December 23, 2020
హైదరాబాద్:స్ట్రెయిన్‌గా రూపాంతరం చెందిన కరోనా ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తోంది. బ్రిటన్‌లో కొత్త రకం వైరస్ వేగంగా విజృంభిస్తోంది. రోజు వారిగా వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య 64.7 శాతానికి చేరింది. బ్రిటన్ నుంచి విమానాల రాకపోకల విషయంలో ప్రపంచ దేశాలు అడుగులు వేస్తున్నాయి. ఆ దేశంతో ఉన్న సరిహద్దులను ఫ్రాన్స్ మూసివేసింది.ఈ నేపథ్యంలో ఇవాళ అత్యవసరంగా సమావేశం అవుతున్న WHO..కొత్త రకం వైరస్‌పై చర్చించనుంది. దాన్ని తట్టుకోవడం ఎలా? దాని నుంచి ప్రపంచ దేశాలకు ఉన్న ముప్పేంటి? ఏ విధంగా అప్రమత్తం చేయాలని దానిపై సభ్యులు చర్చించనున్నారు.
కొత్త వైరస్ నేపథ్యంలో అలజడి మొదలైంది. బ్రిటన్ నుంచి వచ్చిన వారిలో 25 మందికి కరోనా ఉన్నట్లు తేలింది. జన్యుమార్పిడి చెందిన వైరస్ కావొచ్చని ఆందోళన వ్యక్తమవుతోంది. తెలంగాణకు వచ్చిన ఇద్దరిలోనూ కరోనా లక్షణాలు బయటపడ్డాయి. కొత్త వైరస్ నిర్ధారణ కోసం నమూనాలను పుణె పంపారు అధికారులు. గత రెండు వారాల్లో బ్రిటన్ నుంచి 1500 మంది వచ్చినట్లు తెలుస్తోంది. బ్రిటన్ నుంచి వచ్చిన వారికి పరీక్షలు చేయనుంది ప్రభుత్వం. స్ట్రెయిన్ మహమ్మారి కొత్తగా జడలు విప్పుతోన్న వేళ, కేరళలో కొత్తగా 6.049మందికి కరోనా సోకగా, రాష్ట్రంలో 27 మరణాలు సంభవించాయి. దీంతో కేరళ సర్కారు అప్రమత్తమైంది. తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







