2022 లో 10 జట్లతో సరికొత్త ఐపీఎల్..!

- December 24, 2020 , by Maagulf
2022 లో 10 జట్లతో సరికొత్త ఐపీఎల్..!

ముంబై:ఐపీఎల్‌లో కొత్తగా రెండు జట్లను చేర్చేందుకు రంగం సిద్ధమైంది. ఇవాళ జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో కొత్త జట్ల ప్రతిపాదనకు ఆమోద ముద్ర పడింది. కొత్త జట్లు, పన్ను రాయితీ, క్రికెట్‌ కమిటీల ఏర్పాటు ప్రధాన అజెండాగా ఈ ఏజీఎం జరిగింది. కొత్త జట్లు 2022 ఐపీఎల్‌లో అరంగేట్రం చేస్తాయని, అప్పుడు 94 మ్యాచ్‌లతో లీగ్‌ నిర్వహించనున్నారు. ఐపీఎల్‌–2021లో 10 జట్లు ఆడనున్నాయని వార్తలు వచ్చినప్పటికి అవి పుకార్లుగానే మిగిలాయ్ . కరోనా పరిస్థితుల నేపథ్యంలో కొత్త టీంలను లీగ్‌లోకి తీసుకొచ్చి ఇబ్బందులను ఎదర్కొవడం కంటే వచ్చే లీగ్‌ను ప్రస్తుతం ఉన్న తరహాలోనే కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఐపీఎల్‌కు చాలా తక్కువ సమయం ఉండటంతో కొత్త జట్ల కోసం బిడ్డింగ్ నిర్వహించడం కష్టమని బోర్డు బావిస్తోంది. అందుకే 2022లో 10 జట్లతో ఐపీఎల్ నిర్వహించడానికి బీసీసీఐ రెడీ అవుతోంది.

వచ్చే ఐపీఎల్‌ ఆరంభానికి నాలుగు నెలల సమయం కూడా లేదు. ఈ సమయంలో కొత్త జట్లను ఆహ్వనించడం కష్టమే. రెండు నెలల్లోనే కొత్త ఫ్రాంచైజీని ఏర్పాటు చేయడం సవాలుతో కూడుకున్నది. ఇక 2022లో రెండు జట్ల చేరికతో ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లు మరిన్ని పెరుగుతాయి. టీవీ ప్రసార హక్కులను దక్కించుకున్న స్టార్ స్పోర్ట్స్‌కు ఇది లభించే ఆంశం. అదనపు మ్యాచ్‌ల కవరేజీపై బిసిసిఐ, ఆ ఛానల్ మధ్య కొత్త ఒప్పందం కూడా ఉంది. ఇక ఐపీఎల్‌ 2021 తో స్టార్ స్పోర్ట్స్ టెలికాస్ట్ హక్కులు కూడా ముగియబోతున్నాయి.

ఐపిఎల్ 2022 నుంచి కొత్త ప్రసారదారుతో బీసీసీఐ కొంత ఒప్పందాలను కుదుర్చుకొవాల్సిన అవసరం ఉంటుంది. ఈ కారణాల దృష్ట్యానే బిసిసిఐ కొత్త జట్లను చేర్చడంలో బీసీసీఐ ఆలస్యం చేస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com