ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో ఉద్యోగావకాశాలు ..
- December 24, 2020
గ్రూప్ ఎ గెజిటెడ్ ఆఫీసర్ స్థాయి గల అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులకు గాను ఇండియన్ కోస్ట్ గార్డ్ ఆసక్తి ఉన్న యువకుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా గడువు తేదీ లోపు అప్లికేషన్లను సమర్పించాలని కోస్ట్ గార్డ్ తెలియజేసింది.
ఇండియన్ కోస్ట్ గార్డ్ జాబ్ రిక్రూట్‌మెంట్ 2020
* పోస్టు పేరు – అసిస్టెంట్ కమాండెంట్ (గ్రూప్ ఎ గెజిటెడ్ ఆఫీసర్)
* ఖాళీగా ఉన్న పోస్టులు – 25 (ఎస్సీ 5, ఎస్‌టీ 14, ఓబీసీ 6)
* ఉద్యోగం చేయాల్సిన ప్రదేశం – న్యూఢిల్లీ
* దరఖాస్తులను సమర్పించేందుకు చివరి తేదీ – 27-12-2020
* వయస్సు – 1 జూలై 1996 నుంచి 30 జూన్ 2000 మధ్య జన్మించి ఉండాలి
* విద్యార్హతలు – గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుంచి డిగ్రీ లేదా బీఈ, బీటెక్ లలో 60 శాతం మార్కులతో పాస్ అయి ఉండాలి. ఇంటర్, డిగ్రీ స్థాయిల్లో మ్యాథ్స్, ఫిజిక్స్‌లను పాఠ్యాంశాలుగా చదివి ఉండాలి.
ఆసక్తి ఉన్న అభ్యర్థులుhttp://https://www.joinindiancoastgaurd.gov.in/అనే సైట్‌లో ఈ నెల 27వ తేదీ రాత్రి 11.59 గంటలలోపు దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులను ప్రిలిమినరీ ఎగ్జామ్, సైకలాజికల్ టెస్ట్, గ్రూప్ టాస్క్, ఇంటర్వ్యూలలో సాధించిన స్కోరు ఆధారంగా ఎంపిక చేస్తారు. మరిన్ని వివరాలకు https://www.joinindiancoastguard.gov.in/pdf/Advertisement/AC_221.pdf అనే సైట్‌ను సందర్శించి ఇండియన్ కోస్ట్ గార్డ్ విడుదల చేసిన నోటిఫికేషన్‌ను చూడవచ్చు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్‌కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









