'ఆయుష్మాన్ భారత్' స్కీమ్ లాంచ్ చేసిన మోడీ..ఏమిటి దీని ప్రత్యేకత?
- December 26, 2020
న్యూ ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ఆయుష్మాన్ భారత్ స్కీంను వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా లాంచ్ చేశారు. జమ్మూ కశ్మీర్ ప్రాంతవాసులకు హెల్త్ ఇన్సూరెన్స్ స్కీంను పొడిగించడమే దీని ప్రధాన ఉద్దేశ్యం. ఈ స్కీం కింద హెల్త్ కవరేజ్ తో పాటు ఫైనాన్షియల్ రిస్క్ ప్రొటెక్షన్, హెల్త్ సర్వీసెస్ ప్రొటెక్షన్ వంటివి సమకూరుతాయి.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర పాలిత ప్రాంత గవర్నర్, మనోజ్ సిన్హాలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ పథకం కింద కేంద్ర పాలిత ప్రాంతంలో ఉండే వారందరికీ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. అది కూడా దాదాపు రూ.5లక్షల వరకూ ఇస్తారన్నమాట.
ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (పీఎం-జేఏవై) పొడిగింపులో భాగంగా.. దాదాపు 15లక్షల కుటుంబాలు లబ్ధి పొందనున్నాయి. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది దేశవ్యాప్తంగా వర్తిస్తుంది. అక్కడి ప్రాంతాల్లో ఉండే వారు పీఎం-జేఏవై స్కీం కింద ఎక్కడైనా సర్వీసులు పొందవచ్చని పీఎంఓ వెల్లడించింది.
తాజా వార్తలు
- TDP ప్రవేశపెట్టిన తీర్మానానికి వైసీపీ మద్దతు
- ప్రపంచంలో నాలుగో అతిపెద్ద అంతిమయాత్రగా రికార్డు
- శ్రీవారి సేవకులకు VIP బ్రేక్ దర్శనం
- భారీ ఆఫర్లతో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2025
- ఘనంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో 'జీరో' శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!