రష్యాలో కొనసాగుతున్న కరోనా తీవ్రత..
- December 26, 2020
మాస్కో:ఏడాది కాలంగా కరోనా మహమ్మరి తన విశ్వరూపాన్ని చూపిస్తూనే ఉంది. రోజు రోజుకీ పెరుగుతున్న పాజిటివ్ కేసులతో ప్రపంచం తల్లడిల్లుతోంది. ముఖ్యమంగా రష్యాలో కరోనా మహమ్మారి విజృంభణ ఏమాత్రం తగ్గడంలేదు. రోజుకు 25 వేలకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇవాళ కూడా కొత్తగా 29,258 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యినట్లు ఆదేశ హెల్త్ డిపార్ట్‌మెంట్ ప్రకటించింది. దీంతో రష్యాలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 30 లక్షల మార్కును దాటి 30,21,964కు చేరుకుంది. కొత్తగా నమోదైన మొత్తం కేసులలో రాజధాని మాస్కోలోనే 7,480 మందికి కరోనా సోకినట్లు అధికారులు వెల్లడించారు.
ఇక, కరోనా మరణాలు కూడా రష్యాలో భారీగానే నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 567 మంది కరోనా మహమ్మారి బారినపడి ప్రాణాలను కోల్పోయారు. దీంతో ఆ దేశవ్యాప్తంగా మొత్తం కరోనా మరణాల సంఖ్య 54,226కు చేరింది. మరోవైపు, గత 24 గంటల్లో 28,185 మంది వైరస్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జి కావడంతో మొత్తం రికవరీల సంఖ్య 24,26,439కి పెరిగింది. కాగా, బ్రిటన్ కేంద్రంగా ప్రబలుతున్న కొత్త వైరస్ కారణంగా రష్యా ప్రభుత్వం అప్రమత్తమైంది. మరోవైపు త్వరలో కరోనా నుంచి విముక్తి కలిగించేందుకు స్పుత్నిక్-వి వ్యాక్సిన్ అందుబాటులోకి రానున్నట్లు ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి.
తాజా వార్తలు
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!
- బంగ్లాదేశీయులపై యూఏఈ వీసా నిషేధం? నిజమెంత?
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..