తెలంగాణలో పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు
- December 27, 2020
హైదరాబాద్:తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు ఒక్కసారిగా పెరిగాయి.. గత బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో 317 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదు కాగా... తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కోవిడ్ బులెటిన్ ప్రకారం... గత 24 గంటల్లో 472 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి... ఇక, ఇద్దరు మృతిచెందగా... 509 మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు... దీంతో... పాజిటివ్ కేసుల సంఖ్య 2,84,863కు పెరగగా... ఇప్పటి వరకు 2,76,753 మంది రికవరీ అయ్యారు... కరోనా బారినపడి 1531 మంది మృతిచెందారు.. దేశంలో కోవిడ్ మరణాల శాతం 1.4 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 0.53 శాతానికి తగ్గిందని... దేశవ్యాప్తంగా రికవరీ రేటు 95.8 శాతంగా ఏంటే రాష్ట్రంలో 97.15 శాతంగా ఉందని బులెటిన్‌లో పేర్కొంది తెలంగాణ సర్కార్. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 6,579 యాక్టివ్ కేసులు ఉండగా... అందులో 4,426 మంది హోం ఐసోలేషన్‌లోనే ఉన్ఆరు.. గత 24 గంటల్లో 37,347 శాంపిల్స్ పరీక్షించగా... 472 పాజిటివ్ కేసులు వెలుగుచేశాయి.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కరోనా టెస్ట్‌ల సంఖ్య 67,23,710కు పెరిగినట్టు ప్రభుత్వం పేర్కొంది.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







