కోవిడ్ 19 వాక్సినేషన్ సమయాలను ప్రకటించిన ఒమన్
- December 27, 2020
మస్కట్:మస్కట్ పరిధిలో కోవిడ్ 19 వాక్సినేషన్ ఏయే కేంద్రాల్లో, ఏయే సమయాల్లో వేయనున్నారో ఒమన్ ప్రభుత్వం ప్రకటించింది. సీబ్, బౌషర్ స్పెషలైజ్డ్ పాలిక్లినిక్ కేంద్రాల్లో సెలవు రోజుల్లో మినహా తక్కిన అన్ని రోజుల్లో ఉదయం 7.30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు వాక్సినేషన్ ఉంటుంది. ఇక సెలవు రోజుల్లో మాత్రం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు వ్యాక్సిన్ ఇస్తారు. ఇక ఖురియత్ పాలిక్లినిక్ లో మాత్రం ఆదివారం నుంచి గురువారం వరకు ఉదయం 7.30 నుంచి మధ్యాహ్నం 2.30 వరకు వ్యాక్సినేషన్ ఉంటుందని ఆరోగ్య శాఖ తమ అధికారిక ట్విట్టర్ లో వెల్లడించింది. వ్యాక్సినేషన్ లో రిస్క్ ఎక్కువగా వర్గాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారు.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!