తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
- December 27, 2020
హైదరాబాద్:తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. రేపటి నుంచి రైతులకు సంబంధించిన రైతు బంధు ఆర్ధిక సాయం ప్రారంభించబోతున్నది. దీనికోసం మొత్తం రూ.7515 కోట్ల రూపాయలను రిలీజ్ చేసింది. ఈ మొత్తాన్ని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమచేయబోతున్నారు. ఇక ఇదిలా ఉంటె, రైతు బంధు పధకంతో పాటుగా మరొక కీలక నిర్ణయం కూడా ప్రభుత్వం తీసుకున్నది. నియంత్రిత సాగు విధానంను ప్రభుత్వం రద్దు చేసింది. రైతులు నచ్చిన పంట వేసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. గ్రామాల్లో పంట కొనుగోలు కేంద్రాలను కూడా ప్రభుత్వం రద్దు చేస్తున్నట్టు తెలిపింది. పంట కొనుగోలు ద్వారా ప్రభుత్వానికి దాదాపుగా రూ.7500 కోట్లు నష్టం రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నది. రైతులు తమ పంటను ఇష్టం వచ్చిన చోట అమ్ముకోవచ్చని, కేంద్ర చట్టాలు కూడా రైతులు పంటను ఎక్కడైనా అమ్ముకోవచ్చని చెబుతున్నాయని ప్రభుత్వం పేర్కొన్నది.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్‌లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్‌లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







