క్రేజీ కాంబో..విజయ్ దేవరకొండ ను కలిసిన బిగ్ బాస్ విజేత అభిజీత్
- December 28, 2020శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలుసు. ఆ చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరికి ఇండస్ట్రీలో మంచి అవకాశాలు వచ్చాయి. అందరు కొత్తవాళ్లతో సినిమా తీసిన శేఖర్ కమ్ముల ప్రతి ఒక్కరికి బంగారు భవిష్యత్‌ను అందించారు.
ఈ సినిమాలో హీరోగా నటించిన అభిజిత్ ప్రస్తుతం బిగ్‌బాస్-4 విన్నర్‌గా నిలిచారు. అంతేకాకుండా ఇందులో మొదటిసారిగా నెగిటివ్ క్యారెక్టర్ చేసిన రౌడిభాయ్ విజయ్ దేవరకొండ ఎంతపెద్ద స్టార్డమ్ సంపాదించారో అందరికి తెలుసు. అయితే బిగ్‌బాస్ విజయం సాధించిన అభిజిత్ వెనక చాలా మంది ప్రోత్సాహం ఉంది. అందులో ముఖ్యంగా విజయ్ దేవరకొండ, నాగబాబు, లైఫ్ఈజ్ బ్యూటీఫుల్ సినిమా టీం తదితరులు ఉన్నారు. వారందరిని కలుస్తూ అభిజిత్ ధన్యవాదాలు తెలుపుతున్నాడు. తాజాగా విజయ్‌ని కలవడానికి వెళ్లినపుడు అక్కడికి అభిజిత్‌తో పాటు లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ టీం కూడా వచ్చింది. ఈ సందర్భంగా వారు దిగిన ఫొటోలను సుధాకర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో అవి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ