వి.కె దుర్గకు గానామృతవాణి బిరుదు ప్రదానం.....

- December 28, 2020 , by Maagulf
వి.కె దుర్గకు గానామృతవాణి బిరుదు ప్రదానం.....

4 వ ప్రపంచ వంశీ సంగీత సాహిత్య సమ్మేళనం సందర్భంగా వంశీ ఇంటర్నేషనల్ ఇండియా మరియు వేగేశ్న పౌండేషన్ ఇండియా -- అమెరికా నిర్వహించిన పద్మభూషణ్ డా.భానుమతి రామకృష్ణ పాటకు పట్టాభిషేకం సంగీత కార్యక్రమం 25 ,26, 27 తేదీలలో 100 భానుమతి పాటలు పాడిన ఇండియాకు చెందిన గాయని వి కె  దుర్గ కు గానామృతవాణి బిరుదు ప్రదానం చేశారు...  వంశీ -- వేగేశ్న పౌండర్ కళాబ్రహ్మ, శిరోమణి  డా.వంశీ రామరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్వర్ణ యుగ నటీమణి డా.జమున రమణ రావు, ఫిలిం డైరెక్టర్ రేలంగి నరసింహారావు, నటి రాధా ప్రశాంతి, ఎస్.వి.రామారావు, డా.మంగళగిరి ఆదిత్య ప్రసాద్, డా.కె.వి. రావు, కలగా కృష్ణమోహన్, కిన్నెర రఘురామ్, శారదా అశోక వర్ధన్, జోగారావు (ఆస్ట్రేలియా), జయ పీసపాటి (హాంగ్ కాంగ్), సత్య దేవి మల్లుల ( మారిషస్), రత్న కుమార్ కవుటూరు(సింగపూర్),  డా శారదాపూర్ణ సొంటి (చికాగో), గుణ ఎస్ కొమ్మా రెడ్డి (చార్లెట్ ),రాధికా నోరి( ఫ్లోరిడా ),డా మూర్తి జొన్నలగడ్డ (UK ), జి.వి ప్రభాకర్ (USA),మంజు భార్గవ(న్యూజెర్సీ),సురేఖ మూర్తి , డోగిపర్తి శంకర్రావు, రాధిక మంగిపూడి (సింగపూర్ ) అపర ఘంటసాల కె.వెంకట్రావు, డా.తెన్నేటి సుధ, శరత్ బాబు, కాజా, శైలజ సుంకర పల్లి  పాల్గొని భానుమతి కి ఘన నివాళి అర్పించారు..  అంతర్జాలంలో ప్రసారమైన ఈ కార్యక్రమానికి దేశ విదేశీయుల నుంచి  ప్రశంశల వర్షం కురిసింది.. జమున భానుమతి కి నివాళులు అర్పిస్తూ తనను జూనియర్ భానుమతిగా చెప్పుకున్నారు.. ఆమె వ్యక్తిత్వానికి ఎంతో పోలిక ఉన్నదన్నారు..ఈ కార్యక్రమం వంశీ గ్లోబల్ అవార్డ్స్ రికార్డ్స్ లో నమోదు అయినట్టు వంశీ రామరాజు ప్రకటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com