న్యూ ఇయర్ పార్టీలపై నిషేధం...ఉల్లంఘిస్తే 10,000 దిర్హమ్ ల ఫైన్
- December 28, 2020
అబుధాబి: కోవిడ్ 19 వైరస్ రూపాతరం చెంది మరింత వేగంగా వ్యాప్తి చెందే అవకాశాలు ఉండటంతో అబుధాబి అధికారులు అప్రమత్తం అయ్యారు. కొత్త సంవత్సరం వేళ వేడుకలతో వైరస్ విస్తరించకుండా ముందస్తు జాగ్రత్తలు చర్యలు చేపట్టారు. అబుధాబి ప్రజలు ఎవరూ తమ ఇళ్లలోగానీ, పబ్లిక్ ప్రాంతాల్లోగానీ పార్టీలు నిర్వహించటం నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. ఎవరైనా పార్టీల పేరుతో ఒకే చోట గుమికూడి వేడుకలు చేసుకున్నా, సమావేశాలు నిర్వహించినా, ప్రైవేట్, పబ్లిక్ ప్రాంతాల్లో పార్టీలు చేసుకున్నా కఠినంగా వ్యవహరిస్తామని అబుధాబి పాలనా యంత్రాంగం హెచ్చరించింది. పార్టీలు ఏర్పాటు చేసిన వారికి 10 వేల దిర్హామ్ ల జరిమానా విధిస్తామని, అలాగే పార్టీకి హజరైన అతిథులు ప్రతి ఒక్కరికి 5,000 దిర్హామ్ ల చొప్పున ఫైన్ విధించనున్నట్లు వార్నింగ్ ఇచ్చింది. అయితే..షేక్ జయద్ ఫేస్టివల్ లో భాగంగా అల్ వత్బాలో 35 నిమిషాల పాటు సుదీర్ఘంగా ఫైర్ వర్క్స్ నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ భారీ బాణాసంచాతో రెండు గిన్సీస్ రికార్డులు బ్రేక్ కానున్నాయి. ఈ వేడుకలకు ఎలాంటి అవాంతరాలు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. అదే సమయంలో ఫైర్ వర్క్స్ ను చూసేందుకు వచ్చే వారు కోవిడ్ నిబంధనలు పాటించాలని, ప్రతి ఒక్కరు తప్పకుండా భౌతిక దూరం పాటించటంతో పాటు ఫేస్ మాస్క్ ధరించాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!