రామ్ చరణ్ కు కరోనా పాజిటివ్...!
- December 29, 2020
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ను కరోనా వైరస్ కాటేసింది. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో మంగళవారం ఉదయం వెల్లడించారు.
తనకు కరోనా వైరస్ సోకిందనీ వెల్లడించారు. అయితే, తనకు కరోనా లక్షణాల్లో ఒక్కటి కూడా లేదని తెలిపారు. అయినప్పటికీ.. హోం క్వారంటైన్లోకి వెళ్లినట్టు చెప్పారు. అయితే, ఈ వైరస్ నుంచి త్వరగానే కోలుకుని తిరిగివస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు.
కాగా, ఇటీవల చెర్రీ తండ్రి, మెగాస్టార్ చిరంజీవితో పాటు.. ఆయన సోదరుడు నాగబాబుకు కరోనా వైరస్ సోకిన విషయం తెల్సిందే. వీరంతా ఈ వైరస్ నుంచి కోలుకుని, ఇపుడు సాధారణ జీవితాన్ని అనుభవిస్తున్నారు.
కాగా, రామ్ చరణ్ ప్రభుత్వం రెండు సినిమాల్లో నటిస్తున్నారు. అందులో ఒకటి దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్. రెండోది తానే స్వయంగా తన తండ్రి హీరోగా నటిస్తున్న ఆచార్య చిత్రం.
ఈ రెండు చిత్రాల షూటింగుల్లో చెర్రీ బిజీగా గడుపుతున్నారు. ఇక్కడ నుంచే ఆయనకు ఈ వైరస్ సోకివుంటుందని భావిస్తున్నారు.
కంగారులో మెగా ఫ్యామిలీ
ఇటీవల డిసెంబర్ 25న మెగా ఫ్యామిలీలోని యంగ్‌స్టర్స్ అందరూ కలిసి క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు.
ఆ వేడుకల్లో చరణ్-ఉపాసన దంపతులతో పాటు పాటు అల్లు అర్జున్-స్నేహారెడ్డి దంపతులు, అల్లు బాబీ దంపతులు, శిరీష్, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, నిహారిక-చైతన్య దంపతులు, సుస్మిత దంపతులు, శ్రీజ దంపతులు.. ఇలా ఆ ఫ్యామిలీకి చెందిన పలువురు కలిసి పాల్గొన్నారు. ఇప్పుడు చరణ్‌కు కొవిడ్-19గా నిర్ధారణ కావడంతో, ఆ వేడుకల్లో పాల్గొన్న వాళ్లంతా టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం ఏర్పడినట్లే.
తాజా వార్తలు
- జాతీయ భద్రతపైనే ఫోకస్..అమెరికా-ఇరాన్ చర్చల్లో నో రోల్..!!
- హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కొరత లేదు: సీపీ సజ్జనార్
- కువైట్ ఎయిర్పోట్ ఫ్యుయల్ ట్యాంక్ పై డ్రోన్ దాడి..!!
- IRCTCలో 3 కోట్ల ఫేక్ ఖాతాలు: రైల్వే మంత్రి
- ఒమన్ వ్యాప్తంగా 93 మందికి ఆశ్రయం..!!
- ఢిల్లీలోని పార్టీ ఆఫీసు ఖాళీ చేయాలంటూ కాంగ్రెస్ కు కేంద్రం నోటీసులు
- వరల్డ్ హ్యాపినెస్ రిపోర్టు.. 22వ స్థానంలో సౌదీ అరేబియా..!!
- హోంల్యాండ్ సెక్యూరిటీ చీఫ్‌గా అపజయం ఎరుగని ఎంఎంఏ ఫైటర్
- ప్రపంచ కథా దినోత్సవం సందర్భంగా 20 గంటల బుజ్జాయిల కథా మహోత్సవం
- ఇరాన్‌తో శాంతి చర్చలకు వెళ్లము: ఇజ్రాయిల్ రాయబారి డానీ డానన్









