క్లినిక్ లో అబార్షన్: డాక్టర్ అరెస్ట్
- December 29, 2020
సౌదీ: ప్రైవేటు మెడికల్ కాంప్లెక్సులోని క్లినిక్ లో అబార్షన్ నిర్వహిస్తున్న వలసదారుడైన వైద్యుడిని రియాద్ హెల్త్ డిపార్టుమెంట్ అదుపులోకి తీసుకుంది. పలు రోజులుగా ప్రముఖ మెడికల్ కాంప్లెక్సులో ఈ వైద్యుడు అబార్షన్లను నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఇది అత్యంత ప్రమాదకరమైన ఉల్లంఘన అని హెల్త్ అథారిటీస్ చెబుతున్నాయి. 7,000 రియాల్స్ తీసుకుని, నిందితుడు ఆపరేషన్లను నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అత్యంత ప్రత్యేకమైన పరిస్థితుల్లో మాత్రమే అబార్షన్ నిర్వహించాల్సి వుంటుంది. దీనికి సంబంధించి అనేక నిబంధనలు వున్నాయి. ఎప్పటికప్పుడు ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని, ఉల్లంఘనులపై కఠిన చర్యలు తప్పవని అధికారులు ఈ సందర్భంగా హెచ్చరించారు.
తాజా వార్తలు
- కువైట్ లో భద్రతకు చెక్ పాయింట్లు కీలకం..!!
- ఇబ్రిలో అగ్నిప్రమాదం..తప్పిన పెను ప్రమాదం..!!
- బహ్రెయిన్ లో యూఏఈ సైనికుడు మృతి..!!
- ఒమన్ సుల్తాన్‌కు సంతాపం తెలిపిన కింగ్ సల్మాన్, క్రౌన్ ప్రిన్స్..!!
- షకీరా దోహా కాన్సర్ట్ వాయిదా..!!
- యూఏఈ ఆధ్వర్యంలో ఆఫ్గాన్ చెరనుంచి అమెరికన్ విడుదల..!!
- భారత్ లోనే తొలి కారుణ్య మరణం కేసు..
- హైదరాబాద్‌కు 915 ఎలక్ట్రిక్ బస్సులు
- కువైట్ ఎయిర్వేస్ ప్రయాణికులకు శుభవార్త
- సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ భేటీ









