తెలంగాణలో మళ్ళీ పెరుగుతున్న కరోనా కేసులు..
- December 30, 2020
హైదరాబాద్:తెలంగాణలో మళ్ళీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఒక పక్క స్ట్రెయిన్ గుబులు పుట్టిస్తున్న తరుణంలో కరోనా కేసులు పెరగడం కూడా టెన్షన్ పెడుతోంది. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం... గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 474 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. ముగ్గురు మృతి చెందారు.. ఇదే సమయంలో 592 మంది కరోనాబారినపడి కోలుకున్నారు. దీంతో.. రాష్ట్రంలో పాజిటివ్ కేసులు సంఖ్య 2,85,939కు పెరగగా.. ఇప్పటి వరకు 1538 మంది కరోనాతో మృతి చెందారు.. 2,78,523 మంది రికవరీ అయ్యారు.. ఇక, కరోనా మరణాలు దేశంలో 1.4 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 0.53 శాతంగా ఉన్నాయిన.. రికవరీ రేటు దేశంలో 97.40 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 96 శాతానికి పెరిగిందని బులెటిన్ లో పేర్కొంది సర్కార్. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 5,878 యాక్టివ్ కేసులు ఉండగా.. వీరిలో 3,735 హోం ఐసోలేషన్‌లోనే ఉన్నారు.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 45,590 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా... టెస్ట్‌ల సంఖ్య 68,39,281కు చేరినట్టు ప్రభుత్వం పేర్కొంది.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం