జీసీసీ సదస్సుకు ఖతార్ ఎమిర్ ను అహ్వానించిన సౌదీ రాజు

- December 30, 2020 , by Maagulf
జీసీసీ సదస్సుకు ఖతార్ ఎమిర్ ను అహ్వానించిన సౌదీ రాజు

రియాద్:గల్ఫ్ సహాకార మండలి-జీసీసీ సదస్సులో పాల్గొనాల్సిందిగా కోరుతూ సౌదీ రాజు సల్మాన్...బహ్రెయిన్ ఎమిర్ ను అధికారికంగా అహ్వానించారు.  గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ 41వ సదస్సు జనవరి 5న  సౌదీ అరేబియాలోని అల్-ఉలాలో జరుగనున్న విషయం తెలిసిందే. ఈ సదస్సు జీసీసీ సభ్య దేశాల సమైక్యతను మరింత పెంపొందించే దిశగా కొనసాగుతుందని సల్మాన్ ఆకాంక్ష వ్యక్తం చేశారు. అలాగే సభ్య దేశాల మధ్య అన్ని రంగాల్లో పరస్పర సహకారం, సంయుక్త కార్యచరణతో సవాళ్లను విజయవంతంగా ఎదుర్కొవాలని సౌదీ మంత్రివర్గ సమావేశంలో ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదిలాఉంటే..సౌదీ-బహ్రెయినీ సహాకార మండలి తొలి సమావేశంపై కూడా మంత్రి మండలి సమావేశంలో చర్చకు వచ్చింది. బహ్రెయిన్ తో ద్వైపాక్షిక సంబంధం మరింత బలోపేతం చేసుకోవాలని సౌదీ ప్రభుత్వం ఆసక్తిగా ఉందని మంత్రులు అభిప్రాయపడ్డారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com