మస్కట్:కోవిడ్ 19 వ్యాక్సిన్ కోసం అపాయింట్మెంట్ అవసరం లేదన్న ఆరోగ్య శాఖ
- December 31, 2020
మస్కట్:కోవిడ్ 19 వ్యాక్సిన్ వేయించుకునేందుకు అపాయింట్మెంట్, ముందస్తు స్లాట్ బుకింగ్స్ అవసరం లేదని ఒమన్ ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. దగ్గర్లోని ఆరోగ్య కేంద్రాలకు నేరుగా వెళ్లి వ్యాక్సిన్ తీసుకొచ్చని తెలిపింది. ఇప్పటివరకు 1700 మంది వరకు టీకాలు వేయించుకున్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే..ప్రధాన్య క్రమంలో ఎంపిక చేసిన వర్గాల వారు మాత్రమే ఆరోగ్య కేంద్రాలకు వెళ్లాలని సూచించింది. 65 ఏళ్లు దాటిన వృద్ధులు, డయాబెటిస్, అస్తమాతో బాధపడుతున్న వారు, దీర్ఘకాలికంగా శ్వాస కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు కిడ్నీ వ్యాధులు ఉన్నవారు నేరుగా హెల్త్ సెంటర్లకు వెళ్లి వ్యాక్సిన్ తీసుకోవచ్చని సూచించింది. అలాగే వైద్య రంగంలో ఉన్నవారిలో ఐసీయూలో విధులు నిర్వహించే వారితో పాటు కోవిడ్ వార్డుల్లో డ్యూటీ చేస్తున్న వారికి, మెడికల్ స్టాఫ్ లో డయాబెటిస్, శ్వాస కోసం వ్యాధులు ఉన్నవారు నేరు ఆరోగ్య కేంద్రాలకు వెళ్లి వ్యాక్సిన్ వేయించుకోవచ్చని ఆరోగ్య శాఖ అధికారులు వివరించారు.
-లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- సోషల్ మీడియా కంటెంట్ బ్లాకింగ్ పై కేంద్రం కొత్త రూల్స్
- ఐపీఎల్ 2026లో జట్ల హెడ్కోచ్లు వీళ్లే
- ఖతార్ లో నిరాటంకంగా ఆసుపత్రులు, ఆరోగ్య సేవలు..!!
- భార్య మృతికి కారణమైన భర్తకు జైలుశిక్ష ఖరారు..!!
- గ్రాండ్ మసీదులో ఈద్ ప్రార్థనలు రద్దు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన సుల్తాన్, భారత ప్రధాని మోదీ..!!
- ఇరాన్ దాడులకు వ్యతిరేకంగా ఏకమైన అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- ఈద్ అల్ ఫితర్..ఉచిత, డిస్కౌంట్ ఆఫర్స్ కు ఫిదా..!!
- హైదరాబాద్ విమానాశ్రయానికి అవార్డు
- ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ









