‘ఆహా’ ఒరిజినల్‌గా సంక్రాంతి కి 'మెయిల్'
- December 31, 20202020లో తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్తో అలరించిన తెలుగు ఓటీటీ ‘ఆహా’.. రానున్న కొత్త సంవత్సరం 2021కి సరికొత్తగా ఆహ్వానం పలుకుతుంది. అందులో భాగంగా వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై ప్రియాంక దత్, స్వప్న దత్ నిర్మాతలుగా డైరెక్టర్ ఉదయ్ గుర్రాల దర్శకత్వంలో రూపొందిన డిఫరెంట్ మూవీ ‘మెయిల్’. ఈ చిత్రాన్ని 2021 సంక్రాంతి సందర్భంగా జనవరి 13న విడుదల చేస్తున్నారు.
ఇంటర్నెట్ వచ్చిన కొత్తలో ప్రజలు దాని వాడకం తెలిసీ తెలియక ఎలా ప్రవర్తించారనే కథాంశంతో దర్శకుడు ఉదయ్ గుర్రాల హాస్య భరితంగా, మనసుకు హత్తుకునేలా ‘మెయిల్’ను తెరకెక్కించారు. బుధవారం మెయిల్ టీజర్‌ను విడుదల చేశారు. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించారు. ఈ టీజర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది.
నటీనటులు:
ప్రియదర్శి, హర్షిత్ మాల్గి రెడ్డి, మణి అగెరుల, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, శ్రీకాంత్ పల్లె, రవీందర్ బొమ్మకంటి, అనుషా నేత తదితరులు
సాంకేతిక వర్గం:
దర్శకత్వం: ఉదయ్ గుర్రాల
నిర్మాతలు: ప్రియాంక దత్, స్వప్న దత్
సినిమాటోగ్రఫీ: ఉదయ్ గుర్రాల, శ్యామ్ దుపాటి
మ్యూజిక్: స్వీకార్ అగస్తి
ఎడిటర్: హరి శంకర్ టి.ఎన్
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్‌లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు