డిసెంబర్ 24-28 మధ్య 34 శాతం పెరిగిన రోజువారీ కరోనా కేసులు
- December 31, 2020
బహ్రెయిన్: కరోనాపై పోరులో భాగంగా ఏర్పాటైన నేషనల్ మెడికల్ టాస్క్ ఫోర్స్ వెల్లడించిన వివరాల ప్రకారం, డిసెంబర్ 24 నుంచి 28 మధ్య కరోనా పాజిటివ్ కేసుల్లో పెరుగుదల 34 శాతంగా నమోదయ్యింది. డిసెంబర్ మొదట్లో ఇది కేవలం 1.5 అలాగే 2.4గానే వుంది. కాగా, రివకరీ రేటు 97.43 శాతంగా వుంది. 0.38 మరణాల శాతం నమోదయ్యింది. ఐసోలేషన్ ఆక్యుపెన్సీ 8.9 శాతంగా నమోదయ్యింది. మొత్తం 6,078 బెడ్స్ అందుబాటులో వున్నాయి. 540 బెడ్స్ మాత్రమే ఆక్యుపై అయి వున్నాయి. 1,474 అసింప్టమాటిక్ కేసులున్నాయి. డిసెంబర్ 1 నుంచి 28 వరకు కాంట్రాక్ట్ ట్రేసింగ్‌ని పరిశీలిస్తే, సోర్స్ ఆఫ్ ఇన్‌ఫెక్షన్‌కి సంబంధించి 39 శాతం కేసులు కుటుంబ సంబంధితమైనవే కావడం గమనార్హం. మరోపక్క 13 రోజుల్లో 56041 మందికి కరనా వ్యాక్సిన్ అందించారు. ప్రస్తుతం 2014 యాక్టివ్ కేసులు వున్నాయి. వీటిల్లో 10 క్రిటికల్ కేసులు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







