నాలుగు కరోనా స్ట్రెయిన్లు గుర్తించిన WHO
- January 03, 2021
జెనీవా:కరోనాతో ప్రపంచం విలవిలలాడిపోతుంది.వైరస్ వ్యాప్తితో ప్రపంచం మొత్తం కొంతకాలం స్తంభించిపోయింది.దీంతో ఆరోగ్యపరంగా, ఆర్ధికంగా ప్రపంచం ఇబ్బందులకు గురైంది. ప్రస్తుతం ప్రపంచాన్ని కొత్త స్ట్రైన్ భయపెడుతున్నది.ఈ స్ట్రైన్ యుకేలో మొదలైంది.సెప్టెంబర్ లో యూకేలో మొదలైన ఈ స్ట్రెయిన్ డిసెంబర్ నాటికి బయటపడింది.అయితే, యూకేలో బయటపడిన ఈ కొత్త స్ట్రెయిన్ కు ఫైలోజెనిటిక్ సంబంధం లేకపోవడంతో ఈ వైరస్ జన్మరహస్యం అంతుచిక్కనిదిగా మారింది.దేనికంటే ముందు ఆగష్టు,సెప్టెంబర్ లో డెన్మార్క్ లో కొత్త స్ట్రైన్ ను కనుగొన్నారు.ఈ స్ట్రైన్ ను మింక్ జంతువుల్లో కనుగొన్నారు.ఈ కొత్త స్ట్రైన్ కు క్లస్టర్ 5 గా నామకరణం చేశారు. మనిషిలోని రోగనిరోధక శక్తితో సమర్ధవంతమగా పోరాటం చేసి, మనిషిలో ఇమ్మ్యూనిటి పవర్ ను తగ్గిస్తుంది.ఇక ఇదిలా ఉంటె తొలిసారిగా వుహాన్ లో 2019 లో బయటపడిన వైరస్ 2020 జనవరిలో డి614జీ గా జన్యుమార్పిడి జరిగిందని ఈ స్ట్రైన్ ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది WHO తెలిపింది.కాగా, యూకేతో పాటుగా దక్షిణాఫ్రికాలో బయటపడిన కొత్త స్ట్రైన్ కూడా వేగంగా వ్యాపిస్తున్నట్టు ప్రపంచ ఆరోగ్యసంస్థ తెలిపింది.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం