తెలంగాణ పోలీస్ ప్రచారకర్తగా ఎన్టీఆర్..
- January 05, 2021
హైదరాబాద్:ఫేస్‌బుక్ ప్రేమల బారినపడి మోసపోవద్దంటూ టాలీవుడ్ ప్రముఖ నటుడు ఎన్టీఆర్ అవగాహన కల్పిస్తున్నాడు. ఫేస్‌బుక్‌ను వాడుకుంటూ మోసాలకు పాల్పడే ముఠాలు చాలానే ఉన్నాయని, వాటి బారినపడొద్దంటూ తెలంగాణ పోలీసులు రూపొందించిన వీడియోను ఎన్టీఆర్ ప్రమోట్ చేశాడు. ఈ ముఠాలు ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పేరుతో అమ్మాయిల్ని బుట్టలో వేసుకుని, ఫోన్ నంబరు తీసుకుంటాయని, ఆపై ప్రేమ పేరుతో వల విసురుతాయని పోలీసులు ఆ వీడియోలో చూపించారు. కాస్తంత దగ్గరైన తర్వాత వాట్సాప్‌లో అభ్యంతరకర ఫొటోలను తెప్పించుకుంటాయని, అనంతరం రంగంలోకి దిగుతాయని పేర్కొన్నారు. ఆ ఫొటోలు చూపించి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతూ డబ్బులు గుంజే ప్రయత్నం చేస్తారని, ఇవ్వకుంటే ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పెడతామని బెదిరిస్తారని వివరించారు. కాబట్టి ఇలాంటి ఫేస్‌బుక్ పరిచయాలు, ప్రేమలకు దూరంగా ఉండాలని సూచిస్తూ పోలీసులు ఈ వీడియోను రూపొందించారు. ఈ వీడియోను ప్రమోట్ చేసిన ఎన్టీఆర్.. ‘‘చెల్లెమ్మా నా మాట విను.. ఫేస్‌బుక్ మోసాల పట్ల తస్మాత్ జాగ్రత్త’’ అని హెచ్చరించాడు. మోసగాళ్ల బారినపడి ఎవరైనా బాధితులుగా మారితే ధైర్యంగా ముందుకొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించాడు.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్‌లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్‌లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







