ఒకే కుటుంబానికి చెందిన 31 మందికి కరోనా పాజిటివ్
- January 05, 2021
మనామా:మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వెల్లడించిన వివరాల ప్రకారం ఒకే కుటుంబానికి చెందిన 31 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. వీరిలో 14 ఏళ్ళ చిన్నారులు కూడా వున్నారు. కాంట్రాక్ట్ ట్రేసింగ్ ద్వారా ఈ విషయం వెల్లడయ్యింది. నేషనల్ మెడికల్ టాస్క్ ఫోర్స్ సూచించిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటివి సంభవిస్తున్నట్లు మినిస్ట్రీ పేర్కొంది. ప్రతి ఒక్కరూ సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం ద్వారా, మాస్కులు ధరించడం ద్వారా మాత్రమే కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయగలమనీ, ఈ నేపథ్యంలో నిపుణులు సూచిస్తున్న జాగ్రత్త చర్యలు ప్రతి ఒక్కరూ పాటించాలనీ మినిస్ట్రీ హెచ్చరించింది. తక్కువమందితో గేదరింగ్, అత్యవసరమైతే తప్ప బయటకు రాకపోవడం వంటి చర్యల ద్వారా కరోనా వైరస్‌కి దూరంగా వుండవచ్చని మినిస్ట్రీ పౌరులకు, నివాసితులకు సూచిస్తోంది.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్‌లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్‌లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







