ఆందోళన కలిగిస్తున్న భారతీయుల ఆత్మహత్యలు
- February 22, 2016
దోహా విల్లాలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. గడచిన 53 రోజుల్లోనే మొత్తం 9 మంది వివిధ కారణాలతో ఆత్మహత్య చేసుకున్నారు. ఎయిర్‌పోర్ట్ రోడ్డులో ఇంజనీరింగ్ ఫర్మ్‌ను నిర్వహిస్తున్న ఓ వ్యక్తి, ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నాడు. బహ్రెయిన్ నుంచి వచ్చిన ఈ వ్యక్తి తొలుత కంపెనీని సమర్థవంతంగా నిర్వహించి, మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే 18 నెలలుగా పరిస్థితులు తారుమారయ్యాయి. దాంతో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. మృతుడి భార్య ఇటీవల కాంట్రాక్ట్ కోల్పోయారు. ఆమె పనిచేస్తున్న సంస్థ యజమాని తమ వ్యవస్థ సామర్థ్యాన్ని తగ్గించుకోవడంతో ఆమె ఉద్యోగం కోల్పోవాల్సి వచ్చింది. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. మృతుడి సన్నిహితులు ఈ ఘటన పట్ల తాము షాక్ చెందినట్లు చెప్పారు. ఎప్పుడూ సరదాగా ఉండే వ్యక్తి అనీ, ఆర్థిక ఇబ్బందుల గురించి ఎవరి వద్దా ఎప్పుడూ చెప్పలేదని వారు అన్నారు. ఓ లోకల్ బ్యాంక్ నుంచి పెద్ద మొత్తంలో మృతుడు లోన్ స్వీకరించినట్లు తెలియవస్తుంది. ఆత్మహత్యల నివారణలో సన్నిహఙతుల పాత్ర కీలకమని సైకాలజిస్ట్ ఒకరు చెప్పారు. 2016 ప్రారంభం నుంచి ఇద్దరు నేపాలిలు, ఒక శ్రీలంక వలదారుడు ఖతార్‌లో బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్‌లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







