బహ్రెయిన్‌లో యునైటెడ్ నేషన్స్ 70వ యానివర్సరీ
- February 22, 2016
యునైటెడ్ నేషన్స్‌తో (యుఎన్) బహ్రెయిన్ కింగ్ హమాద్ బిన్ ఇఇసా అల్ ఖలీఫా సత్సంబంధాలు కొనసాగిస్తుండడం అభినందనీయమని ఫారిన్ ఎఫైర్స్ మినిస్టర్ షేక్ ఖాలిద్ బిన్ అహ్మద్ అల్ ఖలీఫా చెప్పారు. 'ది యునైటెడ్ నేషన్స్ మరియు బహ్రెయిన్' అనే డాక్యుమెంటరీ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రసంగించారు షేక్ ఖాలిద్. యైనెటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (యుఎన్‌డిపి) సహకారంతో మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. షేక్ ఇసా కల్చరల్ సెంటర్లో, యూఎన్ 70వ యానివర్సరీ వేడుకల్ని నిర్వహించారు. వివిధ రంగాల్లో యూఎన్తో కలిసి పనిచేయడానికి బహ్రెయిన్ సిద్ధంగా ఉందని షేక్ ఖాలిద్ చెప్పారు. డాక్యుమెంటరీ రూపొందించిన 'బాటెల్కో'కి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. బహ్రెయిన్, యునైటెడ్ నేషన్స్ మధ్య సంబంధాల్ని బలోపేతం చేసేలా డాక్యుమెంటరీ రూపొందిందని సభికులు అభిప్రాయపడ్డారు. బహ్రెయిన్ చరిత్రను, యునైటెడ్ నేషన్స్‌లో బహ్రెయిన్ సాధించిన విజయాల్ని ఫొటోల ద్వారా ప్రదర్శించారు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







