కోవిడ్-19 క్వారంటైన్: కొత్త నిబంధనలు విడుదల చేసిన దుబాయ్
- January 06, 2021
దుబాయ్:కోవిడ్ 19 బాధితులతో సన్నిహితంగా మెలిగినవారు, ఎలాంటి లక్షణాలూ లేకపోయినాసరే 10 రోజులు తప్పనిసరిగా హోం క్వారంటైన్లో వుండాలని దుబాయ్ హెల్త్ అథారిటీ స్పష్టం చేసింది. కోవిడ్ బాధితులతో 2 మీటర్ల దూరాన్ని పాటించినాసరే, 15 నిమిషాలు వారికి ఆ దూరంలో వుంటే, హోం క్వారంటైన్ తప్పనిసరి. 10 రోజుల్లోగా కోవిడ్ లక్షణాలు ఏమైనా బయటపడితే, వెంటనే టెస్ట్ చేయించుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. కోవిడ్ పేషెంట్‌గా నిర్థారింపబడటానికి రెండు రోజుల ముందు సదరు వ్యక్తిని కలిసి, తగినంత సమయం ఆ వ్యక్తితో కలిసి వున్నప్పటికీ ‘క్లోజ్ కాంటాక్ట్’ గానే గుర్తిస్తారు. కరోనా లక్షణాలతో ఆసుపత్రిలో చేరినవారికి, జ్వరం తగ్గాక, తిరిగి జ్వరం రాకపోతే 24 గంటల వ్యవధిలో రెండుసార్లు పిసిఆ్ టెస్ట్ చేసి, ఆ తర్వాత మాత్రమే వారిని డిశ్చార్జి చేయడం జరుగుతుంది. 3 రోజుల పాటు జ్వరం లేకపోవడం, పల్మనరీ ఇమేజింగ్‌లో సమస్యలు లేకపోవడం వంటివాటిని పరిగణనలోకి తీసుకుని డిశ్చార్జిపై నిర్ణయం తీసుకుంటారు. ఏడు రోజుల పాటు సెల్ఫ్ ఐసోలేషన్ తర్వాత, మరో రెండు వారాలు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి వుంటుంది. ఏవైనా సమస్యలు తలెత్తితే తిరిగి వైద్యులను సంప్రదించాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!